జ‌న‌సేన సిద్ధాంత‌క‌ర్త‌గా గాలి?

Posted April 4, 2017

gali muddu krishnamanayudu into janasena
చంద్ర‌బాబు కేబినెట్ లో చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణ‌మనాయుడు క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారా?. టీడీపీకి రాజీనామా చేసి జ‌న‌సేన‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారా? అంటే ఔన‌నే అంటున్నారు గాలి స‌న్నిహితులు.

ముద్దుకృష్ణ‌మనాయుడు టీడీపీలో సీనియ‌ర్ నేత‌. ఎన్టీఆర్ హ‌యాం నుంచి బాబు వెన్నంటి ఉన్నారు. ఆ మ‌ధ్య కాంగ్రెస్ లో కి వెళ్లినా… మ‌ళ్లీ చంద్ర‌బాబు ద‌గ్గ‌ర‌కి వ‌చ్చారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ నుంచి మంచి వాయిస్ వినిపించారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో రోజా చేతిలో ఆయ‌న ఓడిపోయారు. సీనియ‌ర్ నేత కావ‌డంతో బాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. మినిస్ట్రీ కూడా వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. బొజ్జ‌ల స్థానంలో .. త‌న‌కే ల‌క్కీ ఛాన్స్ వ‌స్తుంద‌ని ఆయ‌న ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశ‌లు అడియాస‌ల‌య్యాయి. చివ‌ర‌కు ఆ ల‌క్కీ ఛాన్స్ వైసీపీ నుంచి వ‌చ్చిన అమ‌ర్నాథ్ రెడ్డికి ద‌క్క‌డంతో గాలి తీవ్రంగా నిరాశ చెందారు. పార్టీ కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో టీడీపీకి రాజీనామా చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది.

గాలి ముద్దుకృష్ణ‌మనాయుడు జ‌న‌సేనలో చేరే అవ‌కాశ‌ముంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్ తో ఆయ‌న మంత‌నాలు జ‌రిపార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అటు ప‌వ‌న్ నుంచి కూడా సానుకూల సంకేతాలు వ‌చ్చాయ‌ని టాక్. అన్నీఅనుకూలిస్తే…. జ‌న‌సేన‌కు సిద్ధాంత‌క‌ర్త‌గా గాలి ముద్దుకృష్ణ‌మనాయుడు నియ‌మితుల‌య్యే అవ‌కాశ‌ముంద‌ని చెబుతున్నారు. అయితే టీడీపీ హైక‌మాండ్ ను గాలిని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నం చేస్తున్నా… ఇక ఆయ‌న‌ను ఆప‌డం క‌ష్ట‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. చూడాలి మ‌రి … ఆయ‌న వెన‌క్కు త‌గ్గుతారా? అడుగు ముందుకేసి ప‌వ‌న్ పార్టీలో చేరుతారా? అన్న‌ది త్వ‌ర‌లోనే తేలిపోనుంది.

SHARE