Posted [relativedate]
గజినీ సినిమా మీకు బాగానే గుర్తుండి ఉంటుంది ఒక సెల్యూలర్ కంపెనీ కి అధినేత హీరో సూర్య ,మోడల్ ఆసిన్ ని ప్రేమిస్తాడు చివరకు విలన్ చేతిలో దెబ్బతిని మైండ్ పోవడం ఇలా హీరో తన ప్రత్యర్థుల ఫొటోల్ని వాళ్ళ ఫోన్ నంబర్స్ ని పచ్చ బొట్టు వేయించుకోవడం తరవార్త కదా మీకు తెలిసిందే ….కాణిపాకం లో జరిగిన ఘటన కూడా సుమారుగా ఇలాంటి మనస్తత్వం కి అద్దం పట్టేలా వుంది
తిరుపతిలోని ఓ ప్రైవేట్ డెంటల్ క్లినిక్‌లో పనిచేస్తున్న సంధ్య (19)కు బెంగళూరులో మెడికల్ రెప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి అలియాస్ గంగారెడ్డి (25)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమికులుగా మారారు.
క్లినిక్‌లో ఉన్న సంధ్యను చున్నీతో చంపేసి పరారయ్యాడు కిరణ్ కుమార్ రెడ్డి . తరచూ సంధ్య వాళ్ల ఇంటికి వెళ్లే అంత చనువున్న కిరణ్ హఠాత్తుగా సంధ్యను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేశారు. పెళ్లి విషయంలో తమ తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదని సంధ్య చెప్పడంతోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి క్షణికావేశంలో హత్యచేసినట్టు తెలుస్తోంది.
తిరుపతి నుంచి పరారైన కిరణ్ గురువారం రాత్రి కాణిపాకంలోని ఓప్రైవేట్ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు . తనవద్ద ఉన్న ఏటీఎం కార్డును లాడ్జి నిర్వాహకులకు ఇచ్చి.. తమ అమ్మానాన్నలు కూడా స్వామి దర్శనం కోసం వస్తున్నారని. వారు వచ్చాక డబ్బులు కడతానని గదిని అద్దెకు తీసుకున్నాడు. రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి నిర్వాహకులు కిటికీలో నుంచి చూడగా కిరణ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు.
ఓ సూసైడ్ నోట్ కూడా లభించింది. అందులో పెళ్లికి నిరాకరించడం వల్లే సంధ్యను చంపేసి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉందని పోలీసులు తెలిపారు. కాణిపాకం ఎస్ఐ నరేష్‌బాబు, తిరుపతి వెస్ట్ సీఐ రామ్‌కిషోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కిరణ్ జి రెడ్డి పేరుతో ఫేస్బుక్లో ఐడీని క్రియేట్ చేసుకున్న కిరణ్ ఫేస్బుక్లో అతను ఫాలో అవుతున్న ఓ గ్రూప్‌ను చూస్తే వారి ఆత్మహత్యల ఘటనకు అద్దం పడుతోంది. ‘లవ్‌మి…ఆర్ కిల్ మి..బట్ బి విత్‌మి’ ఈపేరుతో ఉన్న ఎఫ్బీ గ్రూప్‌లో కిరణ్ సభ్యుడిగా ఉన్నాడు. ఫేస్బుక్ ప్రొఫైల్ ఫొటోలో కూడా తన క్రియేటివిటీని ప్రదర్శించేవాడు. అందమైన ఫొటోలతో నింపేసేవాడు. సంధ్య ఫొటోపై 16వ తేదీ అని.. తన ఫొటోపై 17వ తేదీ అని రాసి.. సారీ ఫ్రెండ్స్ గుడ్ బై అంటూ పోస్టు కూడా చేసి ఉన్నాడు..