800 సిమ్ కార్డులు,250 అకౌంట్లు ..నయీమ్ రహస్యాలు ..

 gangster nayeem use 800 sim cards 250 accounts nayeem secretsగ్యాంగ్‌స్టర్ నయిం అక్రమ వ్యవహారాలపై సిట్ దర్యాప్తులో రోజుకో ఆసక్తికరమైన, అంశాలు వెల్లడవుతున్నాయి. నయిం నేరచరిత్రతో తమకు సంబంధం లేదని, ఈ నేరగాడితో తమకు పరిచయం లేదంటూ ఇప్పటికే మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి, రిటైర్డు డిజిపి దినేష్‌రెడ్డితో పాటుగా తాజాగా మాజీ ఐపిఎస్ అధికారి శివకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ప్రకటించారు. తాజాగా నయిం దందాలో కొత్తకోణం వెలుగుచూసింది.

అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధికి నరుూంతో సంబంధాలున్నట్లు సిట్ పోలీసులకు ఆధారాలు లభించాయన్న సమాచారం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. నయిం బంధువుల పేరిట దాదాపు 250 వివిధ బ్యాంకులకు చెందిన అకౌంట్లను పోలీసులు గుర్తించారు. నయిం కు చెందిన నాలుగు ఇళ్లల్లో 800 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సిట్ దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నయిం పేరుతో ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేకుండానే వేలకోట్ల రూపాయల లావాదేవీలు నడిపినట్టు సిట్ అధికారులు గుర్తించారు.

బంగారు ఆభరణాలు, నగదుతోపాటు తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోని నరుూం అస్తుల విలువ వేల కోట్ల రూపాయలు ఉండొచ్చని సిట్ అంచనా వేస్తోంది. బినామీల పేరిట ఇప్పటి వరకు 1015 ఎకరాల భూమి, లక్షా 67 వేల 117 చదరపు గజాల ప్లాట్లు ఉన్నట్టు సిట్ గుర్తించింది. ప్రస్తుత రిజిస్ట్రేషన్ చేయించుకున్న తేదీల నాటి విలువ ప్రకారం వీటి విలువ 14.39 కోట్లు కాగా బహిరంగ మార్కెట్ విలువ రూ. 1500 కోట్లకు పైగా ఉంటుందని సిట్ భావిస్తోంది.

సిమ్ కార్డులపై దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలుగు ఇళ్ల సోదాల్లో దొరికిన సుమారు 8వందల సిమ్ కార్డులపై సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సిమ్ వివరాల కోసం టెలికాం కంపెనీలను సంప్రదించారు. ఇన్నాళ్లు భూముల డాక్యుమెంట్లు, ఫ్లాట్లు, ఇళ్ళపై దృష్టి సారించిన సిట్ ఇప్పుడు సాంకేతిక సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. ఆయా నెట్‌వర్క్‌ల సిమ్ కార్డులతో ప్రత్యేక పోలీసు బృందం సిమ్ కంపెనీలకు వెళ్లింది. సిమ్ కార్డులన్నీ ఎవరి పేరిట ఇచ్చారు..చిరునామాలేంటి..ఎవరి ద్వారా చేరాయి అన్న వివరాలతోపాటు కాల్ డేటా జాబితాను సేకరిస్తున్నారు.

ఇందులో అధిక సిమ్‌కార్డులు హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందినవిగా ఆధార్ కార్డు నెంబర్ల ద్వారా గుర్తించినట్టు తెలిసింది. నల్గొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లోని దాదాపు 160 మంది బడా వ్యాపారుల నుంచి టాక్స్ వసూలు చేసినట్టు తెలుస్తోందని సిట్ గుర్తించినట్టు తెలిసింది.హైదరాబాద్‌లో పనిచేస్తున్న హిందుస్తాన్ పెట్రోలియం ఉద్యోగులు కూడా నరుూం బాధితులయ్యారు.

దాదాపు 60 మంది ఉద్యోగులు సికిందరాబాద్ బోయిన్‌పల్లిలో పదేళ్ల క్రితం ప్లాట్లు కొన్నారు. తమతమ పేర్లతో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. కాగా ఓ రోజు నయిం ముఖ్య అనుచరుల్లో ఒకడైన పాశం శ్రీనివాస్ వారిని బెదిరించి ఈ స్థలం భాయ్ సాబ్‌దని, మీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చేయాలంటూ బెదిరించాడు. దీంతో ప్రాణ భయంతో చేసేదేమిలేక నయిం ముఠా ఆగడాలను ఎదురించలేకపోయామని బాధితులు పేర్కొన్నారు.నయిం తోసంబంధాలున్నట్టు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ డిజిపి అనురాగ్ శర్మను కలిశారు. తనకు నయిం వ్యవహారాలతో ఎలాంటి సంబంధం లేదని డిజిపికి వివరించినట్టు తెలిసింది.

SHARE