Sunday, October 17, 2021
Homelatestగన్నవరం ఎమ్మెల్యే అంత మాటన్నారా..?

గన్నవరం ఎమ్మెల్యే అంత మాటన్నారా..?

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండు తెలుగు రాష్ట్రాల్లా పాపులర్. ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న ఆయన టీడీపీకి వీరవిధేయుడ్ని అంటూనే.. అప్పుడప్పుడూ వివాదాస్పదంగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ మహిళా నేతను చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కృష్ణా జిల్లా టీడీపీలో కలకలం మొదలైంది.

గన్నవరం నియోజకవర్గంలో అక్రమాల గురించి మాట్లాడితే వంశీ సహించట్లేదని ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకర పద్మశ్రీ వాపోతున్నారు. అవినీతి గుట్ట విప్పుతున్నందుకు తనను బెదిరిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే గూండాల్ని పెట్టి బెదిరించడం, చంపేస్తానని వార్నింగ్ ఇవ్వడం కూడా అయిపోయిందని ఆమె చెబుతున్నారు.

ఆరోపణలతో ఆగని పద్మశ్రీ.. ఏపీ పీసీసీకి, ఏపీ డీజీపీకి, విజయవాడ సీపీకి తనకు ప్రాణహాని ఉందని లేఖలు రాసి కలకలం రేపారు. వంశీ బెదిరింపులు మానుకుని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు దిగాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా పద్మశ్రీ పబ్లిసిటీ స్టంటేనా.. లేదంటే వంశీ మరోసారి వివాదాల్లో ఇరుక్కుంటారా అనేది తేలాల్సి ఉంది.

- Advertisment -
spot_img

Most Popular