జనసేన వైపు గంటా,కొణతాల చూపు ?

Posted November 12, 2016

ganta srinivasa rao and konathala ramakrishna jumped in pawan kalyan janasena partyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయం ఇప్పుడిప్పుడే వేడెక్కుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనంత బహిరంగ సభ లో తాను వచ్చే ఎన్నికలో పోటీ చేస్తున్నట్టు ప్రకటించటంతో రాజకీయ నేతలు జన సేనలో తమ బెర్త్ ఖాయం చేసుకొనేందుకు పావులు కదుపుతున్నారు అనే సంకేతాలు కనిపిస్తున్నాయి .

మొదటగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు కేబినెట్ లో మంత్రి గా ఉన్నగంటా శ్రీనివాస రావు, ఆయనతో పటు మరో మాజీ మంత్రి వీరిద్దరూ ఇప్పటికే ఆ దిశగా సన్నాహాలు చేసుకొంటున్నారని టాక్ వచ్చేసింది గంటా శ్రీనివాస‌రావు 2009 ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న త‌న టోట‌ల్ టీంతో కాంగ్రెస్‌లో చేరి అక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ కూడా మంత్రి అయ్యారు.

ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబుతో పాటు యువ‌నేత లోకేష్ సైతం గంటాకు స‌రైన ప్ర‌యారిటీ ఇవ్వ‌డం లేదని. ప్ర‌స్తుతం జిల్లా రాజ‌కీయాల్లో గంటా హ‌వా బాగా త‌గ్గి. అయ్య‌న్న‌పాత్రుడి రాజకీయం బాగా ఉందని ఈ పరిస్థితుల్లో టీడీపీలో ఉంటే జిల్లా పాలిటిక్స్‌లో గంటా డామినేష‌న్ క‌ష్ట‌మే.

వీటన్నిటిని బెరీజు వేసుకొన్న గంటా త‌న టీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన‌లోకి జంప్ అయేందుకు రెడీ అవుతున్నార‌ట‌ ఉత్త‌రాంధ్ర‌కే చెందిన మాజీ మంత్రి, దివంగ‌త వైఎస్ హ‌యాంలో ఆయ‌న‌కు ఎంతో న‌మ్మ‌క‌స్తుడైన అనుచ‌ర‌డుగా మెలిగిన కొణ‌తాల రామ‌కృష్ణ ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా కోసం ఉత్త‌రాంధ్రంలోని టీ దుకాణాల్లో చ‌ర్చ చేప‌డుతున్నారు. ప్ర‌త్యేక హోదా అంటే ఏమిటి? దీనివ‌ల్ల లాభాలేంటి? వ‌ంటి అనేక సంగ‌తుల‌ను ఆయ‌న వివ‌రిస్తున్నారు.

జనసేన ప‌వ‌న్ కళ్యాణ్ ఒక్క‌డే ప్ర‌త్యేక హోదా కోసం త‌నగళాన్ని గ‌ట్టిగా వినిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కొణ‌త‌ల కూడా ఈ ప్ర‌త్యేక హోదా రాగం అందుకుని పోరాటం చేయ‌డం కేవ‌లం పవన్ దృష్టిలో ప‌డ‌డం కోస‌మేన‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న త్వ‌ర‌లోనే జ‌నేస‌న అధినేత‌ను క‌లిసి.. ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవ‌చ్చ‌ని అంటున్నారు. మ‌రి ఉప్పు నిప్పుగా ఉండే ఈ ఇద్ద‌రు నేత‌లు ఒకే కుంపట్లో వుంటారో లేదో కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే మరి .

SHARE