వెల్లుల్లితో లాభాలివే….

0
789

 Posted [relativedate]

garlic
వెల్లుల్లితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. దీన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్యాల బారి నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా పచ్చి వెల్లుల్లి తినడం చాలా మంచిది. జలుబు, కాలేయ సంబంధ సమస్యలు, జుట్టు రాలిపోవడం, హర్మోన్ల సమస్యలు, నిద్రలేమి వంటి వాటికి ఇది మంచి పరిష్కారం. ధమనుల్లో పేరుకుపోయిన కొవ్వు నిల్వలను కూడా ఇది కరిగిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.ఫలితంగా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. వెల్లుల్లిలో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్నాయి. అందుకే దాదాపు 7 వేల ఏళ్ల క్రితం నుంచే వెల్లుల్లిని ఆహారంగా ఉపయోగిస్తున్నారు. 

వెల్లుల్లిని తినడమే కాకుండా దిండు కింద పెట్టుకొని నిద్రించడం కూడా మంచి ప్రయోజనాలు పొందవచ్చట. నిద్రలేమితో బాధపడుతున్నవారు దిండు కింద ఓ వెల్లుల్లి రెబ్బను పెట్టుకుంటే.. చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చట.నెగటివ్ ఎనర్జీ ప్రభావం మనపై పడకుండా కూడా వెల్లుల్లి చూస్తుందట.అందుకే కొంత మంది వెల్లుల్లి రెబ్బలను జేబులో వేసుకుని తిరుగుతారు.వెల్లుల్లిని తేనెలో వేసుకొని ఉదయాన్నే తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చనే సంగతి తెలిసిందే. పచ్చి వెల్లుల్లిని తినాలంటే ఘాటుగా ఉంటుందని భయపడుతున్నారా? అయితే దాన్ని నలిపి ఓ 15 నిమిషాలపాటు అలా ఉంచి,తర్వాత తినేయండి. ఇప్పటికీ ఇబ్బందే అనుకుంటే ఏదైనా వెజిటెబుల్ ఆయిల్‌తో కలిపి తినేయండి. ఇలా చేయడం వల్ల ఘాటు తీవ్రత తగ్గుతుంది. 

Leave a Reply