నాగార్జునను మోసేస్తున్న తమిళ దర్శకుడు..!

0
598

Posted [relativedate]

ng1716నాగ చైతన్యతో ఏమాయ చేసావే తీసి హిట్ అందుకున గౌతం మీనన్ అటు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న గౌతం మీనన్ తన డైరక్షన్లో వస్తున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. శివ సినిమా తాను వేల సార్లు చూశానని.. ఆయన వర్కింగ్ స్టైల్ అంటే తనకు ఎంతో ఇష్టమని.. అసలు చైతుతో సినిమా తీయడానికి నాగార్జుననే కారణమని అంటున్నారు గౌతం మీనన్.

తనకు వచ్చిన ప్రతి ఆలోచన నాగార్జునతో పంచుకుంటానని.. నాగ్ తో సినిమా తీయాలని ఎప్పటినుండో అనుకుంటున్నానని.. చైతు కూడా ఆ సినిమాలో ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తానని అన్నారు. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో రిలీజ్ కు సిద్ధమవగా మరోసారి గౌతం మీనన్ డైరక్షన్ మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుదని నమ్ముతున్నారు. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Leave a Reply