క్రిష్ శాతకర్ణిని చంపేస్తాడా .?

0
2171
Gautami Putra Satakarni movie climax krish killed to satakarni balakrishna

Posted [relativedate]

Gautami Putra Satakarni movie climax krish killed to satakarni balakrishna
సాంఘిక సినిమాల్లో క్లైమాక్స్ తీయడం …చేయడం ఇటు దర్శకుడికి ..అటు నటీనటులకు చిన్న విషయం.అదే చారిత్రక సినిమాల విషయంలో సందేహం, సందిగ్ధం తప్పదు.ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి విషయంలో దర్శకుడు క్రిష్ కి సందేహం ఏర్పడింది.ఓ వైపు మాస్ హీరో బాలకృష్ణ…ఇంకో వైపు గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి యోధానుయోధుడు జీవితం ముగింపు చెప్పడం..ఎంతటివారైనా చివరికి మృత్యు ఒడికి చేరాల్సిందే కానీ శాతకర్ణిని అలా చూపితే బాలయ్య ఫాన్స్ హర్ట్ అవుతారేమోనన్న భయం క్రిష్ ని వెంటాడుతోంది.ఈ సమస్యని అటు కర్ర విరక్కుండా ఇటు పాము చావకుండా అన్న పద్ధతిలో ఓ పరిష్కారం కనిపెట్టారట.అది ఇటు బాలయ్య ఫాన్స్ ని నొప్పించకుండా ..అటు చరిత్రని వక్రీకరించకుండా వుంటుందట.

శాతకర్ణి గురించి మరికొన్ని విషయాలు కూడా బయటికి వచ్చాయి. చిత్ర నిడివి రెండు గంటల పన్నెండు నిమిషాలు వుంటుందట.ఫస్ట్ హాఫ్ లో రెండు యుద్ధాలు,రెండో హాఫ్ లో రెండు యుద్ధాలు ఉంటాయి.ఇంటర్వెల్ ఎపిసోడ్,క్లైమాక్స్ ఎపిసోడ్ వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చిత్రీకరించారట క్రిష్.ఇలా అన్ని విషయాలపై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్న చిత్ర యూనిట్ ఎండింగ్ విషయమే కొద్దిగా ఆలోచిస్తోంది . స్టార్ హీరోలతో సినిమా అంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు మరి.

Leave a Reply