శాతకర్ణి ప్రీ-రిలీజ్ బిజినెస్.. కంప్లీట్ లెక్కలు

 Posted October 29, 2016

gautamiputra satakarni movie pre release business totalనందమూరి బాలకృష్ణ వందో సినిమా’గౌతమీపుత్ర శాతకర్ణి’.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చారిత్రాత్మక చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే,రిలీజ్ కి ఇంకా రెండునెలల పైగానే సమయం ఉన్నా.. అప్పుడే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లెక్కలు తేలాయి.

బాలయ్య వందో సినిమా. పైగా దర్శకుడు క్రిష్. చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’.. తెలుగు నేలని ఏలిన గొప్ప చక్రవర్తి కథ. దీంతో.. ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. ఇక, ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అయ్యాక ఆ.. అంచనాలు రెట్టింపు అయ్యాడు. అంచనాలకి దగ్గట్టుగానే శాతకర్ణిప్రీ-రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిపోయింది.ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయ్యింది కూడా.శాతకర్ణి రూ.75కోట్ల ప్రీ-రిలీజ్ బిజెనెస్ చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. నైజాం రూ.11కోట్లు, ఆంధ్ర రూ. 30కోట్లు, సీడెడె రూ. 9కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఓవరీస్, శాటిలైట్ కలుపుకొని మరో రూ. 25కోట్లు వచ్చినట్టు చెబుతున్నారు.

ఇంతకీ  ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఖర్చెంత. ముందుగా ఈ ప్రాజెక్టుని 40 కోట్లలో ముగించాలని ప్లాన్ చేశారట.అయితే,ఇంకా ఐదు,పది ఎక్కువ అవుతాయని లెక్కలేసుకొన్నారు.కొన్ని సీన్స్ రీషూట్స్,గ్రాఫిక్స్‌ కోసం కాస్త భారీగా ఖర్చు పెట్టడంతో ఓవరాల్‌గా చూస్తే రూ. 45-55కోట్ల బడ్జెట్ తో శాతకర్ణి తెరకెక్కింది.ఈ లెక్కన రిలీజ్ కి రెండు నెలల ముందుకే రూ.15-20కోట్ల లాభం తెచ్చిపెట్టింది శాతకర్ణి.సినిమా బడ్జెట్, ప్రీ-రిలీజ్ బడ్జెట్ లెక్కలు తేలడంతో శాతకర్ణి నిర్మాతలు హ్యాపీగా ఫీలవుతున్నారంట.

SHARE