Posted [relativedate]
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం “గౌతమీపుత్ర శాతకర్ణి”.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే రిలీజైన టీజర్‌ను 2.6 మిలియన్స్ ఆడియెన్స్ వీక్షించారు. శాతకర్ణి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ కోసం భారీగా ప్లాన్ చేసింది చిత్రబృందం. ఒకేసారి 100 థియేటర్లలో శాతకర్ణి ట్రైలర్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాలు, యూఎస్,యుకే లలోనూ బాలయ్య ట్రైలర్ సందడి చేయనుంది. డిసెంబర్ మొదటి వారంలో ట్రైలర్ విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ జతకట్టనుంది.తల్లిగా అలనాటి హీరోయిన్ హేమ మాలిన నటించనుంది.ఇప్పటికే 70శాతంపైగా షూటింగ్ పూర్తయిన శాతకర్ణి..వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.