Wednesday, January 19, 2022
HomeEntertainmentCinema Latestఒకే సినిమాలో నలుగురు హీరోలు నలుగురు హీరోయిన్స్‌

ఒకే సినిమాలో నలుగురు హీరోలు నలుగురు హీరోయిన్స్‌

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన దర్శకుడు గౌతం వాసు దేవ్‌ మీనన్‌. తెలుగులో ఈయన తెరకెక్కించిన సినిమాలు యూత్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే ఈయన తెలుగులో ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే చిత్రాన్ని నాగచైతన్యతో తెరకెక్కించిన విషయం తెల్సిందే. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. ఇక త్వరలో ఈ దర్శకుడు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడంలో ఒక సినిమాను చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఆ సినిమాలు నలుగురు హీరోలు నటించనున్నారు. నాలుగు భాషల నుండి ఒక్కో హీరో చొప్పున నలుగురు హీరోలను ఇప్పటికే ఈ దర్శకుడు ఎంపిక చేయడం జరిగింది.

తెలుగు నుండి నాగచైతన్యను దర్శకుడు గౌతం వాసుదేవ్‌ మీనన్‌ ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మలయాళం నుండి పృథ్వీరాజ్‌, కన్నడ నుండి పునీత్‌ రాజ్‌కుమార్‌, తమిళం నుండి శింబులను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా అనుష్క, తమన్నా, మంజిమా మోహన్‌, నివేదా థామస్‌లు నటించనున్నారు. ఒక పెళ్లిలో కలిసిన నలుగురు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు వారం పాటు జాలీ ట్రిప్‌ వేయాలని నిర్ణయించుకుంటారు. అయితే ఆ జాలీ ట్రిప్‌ కాస్త విషాదాంతం అవుతుంది. ఆ జాలీ ట్రిప్‌ ఏంటి, ఆ విషాద గాథ ఏంటి అనే అంశాతో ఒక యూత్‌ ఫుల్‌ స్టోరీని దర్శకుడు గౌతం మీనన్‌ రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో ప్రారంభించే అవకాశాలున్నాయి. వచ్చే సంవత్సరం ద్వితీయార్థంలో విడుదల చేస్తానని దర్శకుడు చెబుతున్నాడు. నాలుగు భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయాలని ఆయన భావిస్తున్నాడు. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ ఈ సినిమాను ఆయా భాషల్లో నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో నిర్మించబోతుంది.

- Advertisment -
spot_img

Most Popular