హా.. హా.. హాసిని మళ్లీ వస్తుంది..!

0
453

Posted [relativedate]

genelia Re-Entry Confirmedహాసిని అనగానే అందరికి బొమ్మరిల్లు సినిమా గుర్తుకు రావడం కామనే.. సిద్ధార్త్, జెనిలియా జంటగా నటించిన ఆ సినిమాలో జెనిలియా నటనకు అందరు తన ఫ్యాన్స్ అయిపోయారు. సౌత్ లో సూపర్ క్రేజ్ సంపాదించిన జెనిలియా ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టి అక్కడే రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లాడింది. అయితే ఇద్దరు పిల్లల తల్లి అయిన జెనిలియా ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఫోర్స్-2 తో జెనిలియా రీ ఎంట్రీ ఫిక్స్ అయ్యింది.

ఘర్షణ సినిమా రీమేక్ గా జాన్ అబ్రహం ఫోర్స్ మూవీ తీశాడు. అయితే ఆ సినిమాలో జెనిలియా నటించింది. ఇక ఆ తర్వాత ఆమె రీతేష్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. అయితే ఇప్పుడు మళ్లీ ఫోర్స్-2 ద్వాతా తిరిగి వెండితెర మీద కనిపించబోతుంది. త్లుగులో కూడా స్టార్ హీరోలందరితో నటించిన జెనిలియా ఛాన్స్ వస్తే సౌత్ సినిమాల్లో కూడా నటించేందుకు సిద్ధమే అని అంటుందట. మరి హా..హా..హాసిని తెలుగులో ఏ సినిమాకు తీసుకుంటారో చూడాలి.

Leave a Reply