Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాజమౌళి రూపొందించిన బాహుబలి వెయ్యికోట్లు కలెక్ట్ చేయడంతో.. హైదరాబాద్ లో కమ్మ ప్రముఖులు గెట్ టు గెదర్ ఏర్పాటుచేసుకున్నారు. తమ వాడు రూపొందించిన సినిమా వెయ్యికోట్లు వసూళ్లు చేయడంపై వారంతా హర్షం వ్యక్తం చేశారు. బాహుబలి రికార్డుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్న ఈ భేటీలో ఏపీ పాలిటిక్స్ చర్చకు వచ్చాయట. ప్రతిపక్ష నేత జగన్, పవర్ స్టార్ పవన్ పొలిటికల్ ఫ్యూచర్ గురించి ఆసక్తికరమైన చర్చ జరిగిందట.
ప్రతిపక్ష నేత జగన్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమనే అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. అవసరమైతే మరోసారి షర్మిల ముందుకొస్తారని కొందరు, భారతి రంగంలోకి దిగుతారని మరికొందరు చెప్పారట. కానీ ఏదేమైనా జగన్ కు ఇబ్బందులు మాత్రం ఎక్కువగానే ఉన్నాయని, ఎన్నికలు ఫేస్ చేయాలంటే రెండు వేల కోట్ల లిక్విడ్ క్యాష్ కావాలని, అంత సీన్ జగన్ కు ఇప్పుడు లేదని అనుకున్నారు.
ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ ట్వీట్లు.. తాటాకు చప్పుళ్లేనన్న అభిప్రాయం గట్టిగా వినిపించింది. చంద్రబాబు పవన్ ను చేయి దాటి పోనివ్వరని, పవన్ కూడా ఒంటరిగా బరిలోకి దిగే సాహసం చేయకపోవచ్చని చెబుతున్నారు. ఒకవేళ పవన్ సోలో సాంగ్ పాడినా.. బాబు తగిన కౌంటర్ ఇవ్వగలరనే అనుకుంటున్నారు. గతంలో అన్న చిరంజీవి హడావిడి చేసినట్లే.. ఇప్పుడు పవన్ చేస్తున్నారని అంతకు మించి ఏమీ లేదని మాట్లాడుకున్నారట. కమ్మ ప్రముఖులు కూడా అప్పుడే ఎన్నికల గురించి చర్చ పెట్టారంటే.. ముందస్తు ఖాయమనే మాట వినిపిస్తోంది.