మెగా ‘ఘాజీ’కి రంగం సిద్దం

0
534
ghazi director sankalp reddy to be movie with varun tej

Posted [relativedate]

ghazi director sankalp reddy to be movie with varun tej
‘ఘాజీ’ చిత్రంతో విమర్శలకు ప్రశంసలు దక్కించుకున్న సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ఒక చిత్రం చేయబోతున్నాడు. ‘ఘాజీ’ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌ దృష్టిని ఆకర్షించిన సంకల్ప్‌ రెడ్డి తాజాగా మరో విభిన్న కథాంశంను సిద్దం చేశాడని, ‘ఘాజీ’ తరహాలోనే ఒక మంచి సబ్జెట్‌తో సంకల్ప్‌ రెడ్డి రావడంతో వరుణ్‌ తేజ్‌ వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఆ స్టోరీకి మెగా బ్రదర్‌ నాగబాబు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

ఒక ప్రముఖ నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. ‘ఘాజీ’ సక్సెస్‌తో హిందీలో కూడా దర్శకుడు సంకల్ప్‌ రెడ్డికి మంచి అవకావాలు తలుపు తట్టాయి. అయితే తెలుగులో కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకునేందుకు సంకల్ప్‌ రెడ్డి తహతహలాడుతున్నాడు. ‘ఘాజీ’ చిత్రంలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకుండానే ఆకట్టుకున్న దర్శకుడు ఈసారి మాత్రం పూర్తి స్థాయి కమర్షియల్‌ చిత్రాన్ని వరుణ్‌ తేజ్‌తో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ఫిదా’ చిత్రంతో బిజీగా ఉన్న మెగా హీరో వరుణ్‌ ఆ తర్వాత సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో సినిమాకు డేట్లు కేటాయించినట్లుగా తెలుస్తోంది.

Leave a Reply