రక్త పిశాచిగా మారాలని ఆలా చేసిందట ..

Posted November 30, 2016, 5:58 pm

Image result for victoria vanattar

ఈ ఘటన నవంబర్ 23వ తేదీన అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో జరిగింది. రక్తపిశాచి గా మారాలనే కోరికతో బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకున్న విక్టోరియా వనట్టెర్.మహిళ. బాయ్ ఫ్రెండ్ తో మద్యం తాగించి తన రక్తం తాగాలంటూ అతడిని ఒత్తిడి చేసింది. ముందు ఒప్పుకోక పోయినా ఆ తర్వాత ఓకే చెప్పాడు ప్రియుడు, బాక్స్ కట్టర్ చేత తన చేతిని కట్ చేయించి రక్తాన్ని అతడిచేత తాగించింది. ఆ తరువాత కత్తితో అతనిపై దాడి చేసి, చంపబోయింది. ఈ క్రమంలో, అతని భుజంలో కత్తి కూడా దిగింది. అనంతరం,పోలీస్ లు అరెస్ట్ చేసి ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా… తనను క్షమించి వదిలేయాలని వేడుకుంది. దీంతో, 1.50 లక్షల డాలర్ల పూచికత్తుతో ఆమెకు జైలు శిక్షను విధించారు…పిచ్చి పలు రకాలు అంటారు ఇదే అనుకుంట ..