Saturday, October 16, 2021
Homelatestమమతకు షాకిచ్చిన గూర్ఖాలు

మమతకు షాకిచ్చిన గూర్ఖాలు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తెలంగాణ కంటే ముందే మొదలైన ప్రాంతీయ ఉద్యమం గూర్ఖా ఉద్యమం. పశ్చిమ్ బంగలో అంతర్భాగంగా ఉన్న తమ ప్రాంతాలన్నింటినీ గూర్ఖాల్యాండ్ పేరుతో రాష్ట్రం చేయాలని వారు కోరుతున్నారు. ఇందుకోసం గూర్ఖా జనముక్తి మోర్చా కూడా ఏర్పాటైంది. అప్పట్లో మమత సీఎం అయిన తొలినాళ్లలో వీరితో చర్చలు జరిపి ఉద్యమాన్ని ఆపేయించిన మమత.. గూర్ఖాల్యాండ్ టెర్రిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ తో సమస్యకు ముగింపు పలికారు. దీనికి కేంద్రం కూడా సహకరించడంతో. మమత పని తేలికైంది.  

అయితే అంతా తన ఘనతేనని ప్రచారం చేసుకున్న మమత.. ఇప్పుడు దిక్కుతోచక కేంద్రం సాయం కోసం దేబిరించారు. బెంగాల్లో దుర్గమ్మ తమ దీదీయేనని ధైర్యంగా చెప్పుకునే తృణమూల్ కార్యకర్తలకు పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లైంది. తాము పదవి ఇస్తే తీసుకున్న గూర్ఖా జన ముక్తిమోర్చా నేత బిమల్ గురుంగ్.. మమతనే సవాల్ చేయడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఆర్మీని వ్యతిరేకించే మమత.చివరకు వాళ్ల సాయం కోరడం కూడా సొంత పార్టీ నేతలకు అవమానంగానే ఉంది.

45 ఏళ్ల తర్వాత డార్జిలింగ్ లో క్యాబినెట్ సమావేశం నిర్వహించిన మమత.. పదో తరగతి వరకు స్కూళ్లలో బెంగాలీ తప్పనిసరి చేశారు. అంతే రెచ్చిపోయిన గూర్ఖాలు.. మమత క్యాబినెట్ మీటింగ్ దగ్గరకు వచ్చి నానా రచ్చ చేశారు. పైగా మమతకు దమ్ముంటే తమ ఉద్యమం ఆపాలని గురుంగ్ సవాల్ చేశారు. దీంతో తృణమూల్ నేతలు బిత్తరపోతున్నారు. గూర్ఖాలతో పెట్టుకుంటే ఏమౌతుందో వారికి బాగా తెలుసు. చివరకు దిగొచ్చిన మమత నేపాలీని కూడా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. అయినా ఉద్యమం ఆగలేదు. ఈసారి గురుంగ్ వ్యూహమేంటో ఎవరికీ అంతుబట్టడం లేదు.

- Advertisment -
spot_img

Most Popular