ఆకతాయిల్ని ఇరగదీసిన అమ్మాయిలు

girls beating teasing boys
సినిమాల్లో హీరోయన్‌ను విలన్ బ్యాచ్ టీజ్ చేసినట్టుగా నిజ జీవితంలో చేద్దా మనుకున్న ఆ యువకులకు దిమ్మదిరిగే కౌం టర్ ఇచ్చారు ముగ్గురమ్మాయిలు. తమను ఏడిపిస్తున్న నలుగురు ఆకతాయి అబ్బాయి లకు స్థానిక మహిళలతో కలిసి ముగ్గురు అమ్మాయిలు చుక్కలు చూపించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకతాలోని జగ్దాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయుర్వేద కళాశా లలో రోహన్ హొస్సేన్, సురేష్ భూనియా, దీపక్ సింగ్, బిప్లబ్ దేబ్ విద్యన భ్యసిస్తూ, అదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.

వీరు ఉన్న ప్రాంతం మీదుగా వెళ్లాలంటే అక్కడి అమ్మాయిలకు విపరీతమైన భయం. వీరి కామెంట్లు, కాంప్లిమెంట్లు, వెగటు వ్యాఖ్యలు వినలేక ఇబ్బంది పడతారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ముగ్గురు స్నేహితురాళ్లు అటుగా వెళుతుండగా, ఈ నలుగురు ఆకతాయిలు వారికి అసభ్యకరమైన సైగలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు వారిపై తిరగబడ్డారు. అపర కాళీలై వారిని పట్టుకుని రెండు చెంపలు వాయించే సరికి, యువకులు బెదరింపులకు దిగారు. దీంతో ఈ తతంగాన్ని చూస్తున్న స్థానిక మహిళలు కూడా వారికి తోడై తుంటరిగాళ్లకు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.
…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here