దేవుడు దెబ్బేశాడు.

0
442

venky-modi-devuduఈ దేశాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీని దేవుడంటే తప్పేంటి? పది పదిహేను రోజుల కిందట కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలివి. ఈయన ఆయన్ను దేవుడనుకున్నాడు కానీ… ఆయన ఈయన్ను భక్తుడిగా భావించలేదేమో…అందుకే మంత్రివర్గ తర్వాత శాఖల కేటాయింపు వ్యవహారంతో వెంకయ్యను షాక్ తినిపించారు.

ఇటీవలే పార్టీ నియమాలు, సంప్రదాయాలు లాంటి కబుర్లన్నీ పక్కనబెట్టి మరీ వెంకయ్యకు రాజ్యసభ స్థానం ఇచ్చారు. ఇంకేముంది మోడీని వెంకయ్య దేవుడనేశారు. ఇపుడు అదే మోడీ తన ప్రాధాన్యం తగ్గ్గిస్తూ సమాచార శాఖ బాధ్యతలు అప్పగించడం చూసి ఎంటారో!. వాగ్ధాటి ఉంది కాబట్టి మనసులో బాధను మాటతో కప్పేస్తారేమో! కానీ జనం కళ్లెలా మూస్తారు?.

జాతీయ రాజకీయాల మాటేమోగానీ ఈవార్త తెలిసిన బీజేపీ రాష్ట్రశాఖలోని వెంకయ్య వ్యతిరేకులు పండగ చేసుకుంటున్నారు. ఇది వెంకయ్యకు మాత్రమే హెచ్చరిక కాదని…ఆయన వెనుక ఉన్నవారికి కూడా వార్నింగ్ అని తమదైన భాష్యం చెప్తున్నారు…వింటున్నారా తెలుగు తమ్ముళ్ళూ…అక్కడ మోడీ వేసిన బాంబు… ఎక్కడ పేలుతుందో?

Leave a Reply