నదీ అనుసంధాన ఆంధ్ర ..

  godavari flood water converter and mixed krishna pattiseema
గోదావరి వరద జలాల్ని కృష్ణకి తరలించే పట్టిసీమ ఆలోచన ఫలించడంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అదే దిశగా మరికొన్ని ఆలోచనలకు శ్రీకారం చుట్టింది.నదీజల సంధానానికి అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది.వర్షాభావ పరిస్థితుల్లో వున్న కృష్ణ ,గుంటూరు జిల్లా రైతులకి పట్టిసీమ వల్ల సకాలంలో నాట్లు పడిన విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరింత ఊతమిచ్చింది.

తాజాగా ఉత్తరాంధ్ర రైతులకి మేలు చేసే మరో ప్రాజెక్ట్ కి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో వంశధార,నాగావళి నదుల్ని అనుసంధానం చేయాలని నిశ్చయించింది .పట్టిసీమ లాగ త్వరితంగా అంటే ఏడాదికల్లా ఈ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నీటిపారుదల శాఖని ఆదేశించారు.దీనివల్ల వంశధార నుంచి సముద్రంలోకి వృధాగా వెళ్తున్న 10…11 టీఎంసీల నీరు నాగావళికి మళ్లిస్తారు.

గోదావరినది ఎడమవైపు పురుషోత్తమ పట్నం దగ్గర ఓ ఎత్తిపోతల పధకానికి కూడా ఏపీ సర్కార్ నడుం కట్టింది.ఈ పధకం పూర్తి అయితే ఏలేరు ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందించగలుగుతామని ప్రభుత్వం భావిస్తోంది.మొత్తానికి పట్టిసీమ పనితనం సర్కారుకి కొత్త ఉత్సాహం ఇచ్చిందనడంలో సందేహం లేదు .

SHARE