బాబు ‘బంగారం’ పంట పండినట్లే…

0
609

bangaram
కాలం కలిసి వస్తే నడిచి వచ్చే బిడ్డ పుడతాడని సా మెత. బాబు బం గారం వ్యవహారం అలాగే కనిపిస్తోంది. ఈనెల 29 న వద్దాం అనుకున్నారు. కానీ ముందు వారం రజనీ కాంత్ కబాలి వస్తోంది. ఏం చేయాలా అని కిందా మీదా అవుతూ, ఆఖరికి ఆగస్టు మూడో వారానికి వెళ్లాలని అనుకు న్నారు. ఎందుకంటే ఆగస్టు 12న జనతా గ్యారేజ్ వుంటుంది కాబట్టి అటో వారం, ఇటో వారం వదిలేద్దామని. ఇప్పుడు జనతా గ్యారేజ్ ఏకంగా సెప్టెంబర్‌కు వెళ్లిపోయింది. మాంచి లాంగ్ వీకెండ్ డేట్ ఖాళీగా వుంది. అందుకే ఆ డేట్ ను వాడుకోవాలని బాబు బంగారం డిసైడ్ అయిపోయాడు. 12న విడుదలయితే ఫుల్ హాలీడే మూడ్ వుంటుంది నాలగు రోజుల పాటు. పైగా వెనుక కూడా వచ్చే సినిమాలు ఏవీ లేవు.

ముందు కూడా కబాలి తరువాత మూడు వారాల పాటు పెద్ద సినిమాలు ఏవీ వుండవు. జనతా గ్యారేజ్ వదిలేసుకున్న అద్భుతమైన అవకాశాన్ని బంగారం అందిపుచ్చేసుకు న్నాడన్న మాట. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వెంకీ సరసన నయన తార నటిస్తోంది. వెంకటేష్ నటించిన గోపాలా గోపాలా చిత్రం తరువాత గ్యాప్ తీసుకుని వస్తున్న చిత్రం బాబు బంగారం. వెంకీ నాన్న గారు డి రామానాయుడు చనిపోయిన తరువాత చేస్తున్న చిత్రం కూడా ఇదే. వెంకీ చాలా ఆశలు ఈ చిత్రం మీదే పట్టుకున్నాడు. వెంకీ గ్యాప్‌లో నాగార్జున రెండు హిట్ చిత్రాలు ఇచ్చాడు. సోగ్గడే చిన్నినాయనా, ఊపిరి చిత్రాలు నాగార్జునకు మంచి పేరు తెచ్చాయి. సోగ్గడే చిన్నినాయనా చిత్రం నాగార్జునకు 50 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లాయి. అందుకే వెంకీ లేట్ అయినా లెటేస్ట్ హిట్ ఇవ్వాడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. భలేభలేమగాడివో చిత్రం హిట్ ఇచ్చిన మారుతికి బాబు బంగారం మరో హిట్ అవుతుందన్న నమ్మకంతో వెంకీ ఉన్నాడు.

Leave a Reply