బంగారానికి తుప్పు పడుతుందా ?

Posted [relativedate]

gold can detect mistakesబంగారానికి తుప్పు పడుతుందా ..ఇనుముకే తుప్పేందుకు పడుతుంది..? తుప్పు పట్టడం అనేది కెమికల్ రియాక్షన్. ఇనుము, జింకు, రాగి వంటి లోహాలు తుప్పు పడతాయి. ఇనుము తుప్పు పట్టడం అంటే అర్థం ఇనుప వస్తువులు (Fe), గాలిలో ఉన్న నీటి ఆవిరి (H2o),ఆక్సిజన్‌ వాయువులతో కలిసి తుదకు Fe2o3. 2H2o అనే సంయోగ పదార్థం ఏర్పడడం. ఈ సంయోగ పదార్థాన్నే మనము సాధారణంగా తుప్పు అంటాం.

రసాయనికంగా వాటి అంతట అవే ప్రకృతి సిద్ధంగా జరిగే చర్యల్లో సాధారణంగా శక్తి ఎక్కువగా ఉన్న రూపం నుంచి పదార్థాలు శక్తి తక్కువగా ఉన్న రూపంలోకి వెళ్లడానికి ఉత్సాహం చూపిస్తాయి. ఆ రీత్యా బంగారం అనే మూలక రూప వస్తువు శక్తి కన్నా బంగారం తుప్పు పడితే ఏర్పడే Auo2అనే తుప్పు సంయోగ పదార్థపు శక్తి ఎక్కువ. అంటే బంగారపు తుప్పు కన్నా బంగారానికే రసాయనిక స్థిరత్వం ఎక్కువ. అందుకే బంగారం తుప్పు పట్టదు.కానీ ఇనుము సహజ రూపం ఖనిజ రూపమైన తుప్పు రూపమే! అందుకే తుప్పు పడుతుంది ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here