బంగారం మోజుపై పరిశోధన..

0
527

gold craze research

ప్రపంచంలోని అన్ని దేశాల్లో కంటే భారత్ లోనే బంగారానికి ఎక్కడ లేని డిమాండ్. దేశంలోని ఏ కుటుంబాన్ని తీసుకున్నా… అంతో, ఇంతో బంగారం ఉండి తీరాల్సిందే. ఆర్థిక స్థాయులను బట్టి ఆయా కుటుంబాలు పసిడి డాబును ప్రదర్శిస్తున్నాయి. అయినా ప్రపంచంలోని ఏ ఒక్క దేశంలోనూ బంగారంపై కనిపించని ఈ మోజు భారత్ లోనే ఎందుకు కనిపిస్తోంది? ఈ విషయంపై సమాధానం చెప్పడం కష్టమే. అందుకేనేమో… ఈ కారణాన్ని నిగ్గు తేల్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు ఏకంగా ఓ కమిటీనే నియమించింది.

ప్రతిష్ఠాత్మక ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని ఫైనాన్సియల్ ఎకనమిక్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న తరుణ్ రామదొరై ఈ కమిటీకి నేతృత్వం  వహిస్తున్నారు. ఆర్బీఐ, సెబీ, ఐఆర్డీఏఐ, పీఎఫ్ఆర్డీఏలకు చెందిన ఆర్థిక నిపుణులు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. బంగారంపై భారతీయుల మోజుపై సుదీర్ఘ అధ్యయనం చేయనున్న ఈ కమిటీ వచ్చే ఏడాది జూలై చివరి నాటికి తన నివేదికను ఆర్బీఐకి సమర్పించనుంది.

Leave a Reply