
దేశీయ మార్కెట్ లో బంగారం వర్తకుల నిరంతర కొనుగోళ్లు బులియన్ మార్కెట్ ను ప్రభావితం చేస్తోందని అప్ వర్డ్ ట్రెండ్ నెలకొందని తెలిపారు. దేశరాజధానిలో 99.9 , 99.5 స్వచ్ఛత బంగారం గత మూడు సెషన్స్‌లో 100 రూపాయలకు పైగా లాభపడింది. పది గ్రా. రూ 31.250 చొప్పున పలుకుతోంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో 31,465 వద్ద ఉంది.
అటు నేటి మార్కెట్ లో బంగారం, వజ్రాభరణాల సంస్థల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ముఖ్యంగా గీతాంజలి జెమ్స్ కొనుగోళ్ల మద్దతుతో కాంతులీనుతోంది. కాగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినా అమెరికా ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉంటుందన్న అమెరికా ప్రకటనతో డాలర్ పుంజుకుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ లో 0.5శాతం నష్టపోయి ఔన్స్ బంగారం 1346 డాలర్ల దగ్గర ఉంది. ఇక వెండి ధరలు స్వల్పంగా క్షీణించాయి.