పుత్తడికి గ్రహణం .తగ్గిన ధరలు

Posted December 10, 2016

gold rates decreased because of currency bannedపుత్తడి (బంగారం) ధరలు పది నెలల కనిష్ఠానికి చేరాయి. బులియన్‌ మార్కెట్‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.130 తగ్గి రూ.28,580 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 9 తర్వాత పసిడికిదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.

బలహీన అంతర్జాతీయ సంకేతాలతో పాటు డిమాండ్‌ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలు, డాలర్‌ బలపడటం వల్ల సెంటిమెంట్‌ బలహీనంగా ఉందని మార్కెట్ వర్గాల అభిప్రాయం పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడిన నగదు కొరత వల్ల డిమాండ్‌ తగ్గిందని అంటున్నారు.

SHARE