ఆ రిసార్ట్ కి బిల్లు కట్టే పనిలేదు..ఎందుకంటే ?

0
414
golden bay resorts no bill payment because of palaniswamy owner of that resort

Posted [relativedate]

golden bay resorts no bill payment because of palaniswamy owner of that resort
గోల్డెన్ బే రిసార్ట్..దాదాపు పది రోజులుగా ఒక్క తమిళనాడు మాత్రమే కాకుండా దేశమంతటా ఈ రిసార్ట్ పేరు మార్మోగింది.100 మందికి పైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్ని అన్ని రకాలుగా భరించింది ఈ రిసార్ట్.శశికళ కూడా రెండుమూడు సార్లు ఇక్కడికే తరలివచ్చింది.కోర్టు శిక్ష విషయం కూడా ఆమెకి ఇక్కడే తెలిసింది.ఇక ఆ రిసార్ట్ నుంచి ఎమ్మెల్యేల్ని బయటకు రప్పించడానికి పన్నీర్ వర్గం ఎన్నో ప్రయత్నాలు చేసింది.పోలీసుల కవాతులు,విచారణలు,ఎత్తుగడలు,ఏడుపులు,నవ్వులు,తుళ్ళింతలు ఇలా ఎన్నో ఘట్టాలకు ఆ రిసార్ట్ వేదికగా నిలిచింది. అంతా బాగానే వుంది కానీ ఇంతమందిని ఇన్ని విధాలుగా భరించిన ఆ రిసార్ట్ కి బిల్లు కట్టేది ఎవరు ? ఈ ప్రశ్నకి తలో సమాధానం చెప్పొచ్చు.కానీ అవేమీ నిజం కాదట.అసలు ఎవరూ బిల్లు కట్టే పనిలేదు.ఎందుకంటే?

గోల్డెన్ బే రిసార్ట్ గురించి కొన్నాళ్ల కిందట సోషల్ మీడియాలో ఓ జోక్ ప్రచారమైంది.తనకు ఎక్కువమంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శశికళ,పన్నీర్ కొట్టుకుంటుంటే..ఎమ్మెల్యేలంతా తన రిసార్ట్ లో ఉంటున్నందున తానే కాబోయే సీఎం అని దాని ఓనర్ అంటున్నట్టు సోషల్ మీడియాలో జోక్ సారాంశం.ఆ జోక్ నిజంగా నిజమైందట.తాజాగా తెలుస్తున్న వార్త ఏంటంటే..గోల్డెన్ బే రిసార్ట్ ఓనర్ ఎవరో కాదంట.పైకి ఎవరి పేరు వినిపిస్తున్నా దాని అసలు ఓనర్ తమిళనాడుకి కాబోయే సీఎం పళనిస్వామి అంట.ఆయనే సీఎం అవుతుంటే ఇక క్యాంపు లో ఉన్న ఎమ్మెల్యేలకు బిల్లు కట్టే అవసరం ఏముంటుంది ?

Leave a Reply