నోరూరించే గోంగూర పులిహోర రెడీ మీకోసం

0
750
gongura pulihora recipe

Posted [relativedate]

gongura pulihora recipeగోంగూర అనగానే అందరికి నోరూరుతుంది ..అదే పండుమిరపకాయలు వేసి తొక్కి చేస్తే అబ్బో ఆ రుచి మాటల్లో చెప్పలేం లే.. ఇంకా గోంగూర పప్పు , పచ్చడి ఇలా రొటీన్ ఐటమ్స్ సంగతి సరే సరి ..కానీ ఈ పులిహోర స్పెషలిటీ మాత్రం అదుర్స్ .ఒకసారిట్రీ చేస్తారా మరి ..ఎదిగి తయారీ విధానం ..మీకోసం..

కావలసిన పదార్థాలు:
గోంగూర – 2 కప్పులు, పొడి అన్నం – 2 కప్పులు, పసుపు – అర టీ స్పూను, కరివేపాకు – 4 రెబ్బలు, ఉప్పు – రుచికి తగినంత, మెంతులు – అర టీ స్పూను, ఎండుమిర్చి – 3, ఆవాలు – 1 టీ స్పూను; తాలింపు కోసం: శనగపప్పు, మినప్పప్పు – 1 టేబుల్‌ స్పూను చొప్పున, ఎండుమిర్చి – 2, ఇంగువ – పావు టీ స్పూను, (వేగించి పొట్టు తీసిన) వేరుశనగ పప్పు – 2 గుప్పిళ్ళు, నూనె – 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: అన్నానికి పసుపు, ఉప్పు, ఒక టేబుల్‌ స్పూను నూనె, కొద్దిగా కరివేపాకు (తరుగు) పట్టించి పక్కనుంచాలి. ఒక టీ స్పూను నూనెలో ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి దోరగా వేగించి తీసెయ్యాలి. అదే కడాయిలో మరి కొద్ది నూనె వేసి గోంగూర పచ్చివాసన పోయే వరకు వేగించి, చల్లారిన తర్వాత ఆవాలు, మెంతులు, ఎండుమిర్చితో పాటు (నీరు కలపకుండా) మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. అన్నంలో ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పప్పులు, కరివేపాకుల తాలింపుతో పాటు గోంగూర పేస్టు, వేరుశనగలు వేసి బాగా కలపాలి.

ఈ పులిహోరతో మజ్జిగ మిరపకాయలు నంజుకుంటే బాగుంటాయి.చూడండి

Leave a Reply