ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

 Posted March 27, 2017

good news to prabhas fansప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న బాహుబలి-2 సినిమా ఏప్రిల్-28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమా పబ్లిసిటీ పనులను వేగవంతం చేసిన చిత్రయూనిట్ నిన్న  ప్రీరిలీజ్ ఫంక్షన్  ని అట్టహాసంగా జరిపించింది. ఈ సందర్భంగా వేదికపై ప్రభాస్ మాట్లాడాడు. అభిమానులకు, చిత్ర యూనిట్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రభాస్ ఇకపై ఫ్యాన్స్ కోసం ఏడాదికి రెండు సినిమాలు చేసే ప్రయత్నం చేస్తానని ప్రకటించాడు. అలానే రానా కూడా ప్రభాస్ గురించి తనదైన శైలిలో స్పందించాడు. ఎన్ని సినిమాలు చేసినా సరే ప్రభాసే తనకు ఫేవరేట్ కో స్టార్ అంటూ  ప్రభాస్ ని ఆకాశానికి ఎత్తేశాడు.  కాలం కరిగిపోయే క్షణాల సమూహమైతే… బాహుబలి కలకలం నిలిచిపోయే చిత్రమని రెండేళ్ల కిందట తాను చెప్పానని, తన మాటను నిజం చేసిన అభిమానులకు ధన్యవాదాలని తెలియజేశాడు రానా.


SHARE