జంపింగుల‌కు గుడ్ న్యూస్!!!

 Posted March 23, 2017

goodnews to migrated leaders
రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఎమ్మెల్యేలు అధికారపార్టీల్లోకి జంప్ అయిపోయారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ లోకి… ఏపీలో టీడీపీలోకి వెళ్లిపోయారు. అయితే ఈ ఎమ్మెల్యేల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీట్లు వ‌స్తాయా..? రావా ?అన్న భ‌యం వెంటాడుతోంది. ఎందుకంటే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార‌పార్టీ నుంచి పోటీ చేసీ ఓడిపోయిన అభ్య‌ర్థులున్నారు. దీంతో సిట్టింగ్ స్థానంలో అవ‌కాశం ఇస్తారా? లేదా? అని తెగ టెన్షన్ ప‌డుతున్నారు.

సీటు వ‌స్తుందో లేదోన‌న్న క‌న్ఫ్యూజ‌న్ లో ఉన్న సిట్టింగుల‌కు పెద్ద రిలీఫ్. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సానుకూల ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ సెష‌న్ లోనే సీట్ల పెంపుపై బిల్లును పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని కేంద్ర హోంమంత్రి రాజ‌నాథ్ సింగ్ ప్ర‌క‌టించారు. అసెంబ్లీ సీట్ల పెంపున‌కు కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. ఒక‌వేళ ఈసారి వీలుకాక‌పోయినా వ‌చ్చే స‌మావేశాల్లో త‌ప్పకుండా బిల్లు వ‌స్తుంద‌న్నారు. ఇక కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు కేంద్రం రాజ్యాంగ సవరణకూ రెడీగా ఉంద‌ని చెప్ప‌గా… మ‌రో కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి అయితే ఈనెల 29న కేబినెట్ ముందుకు బిల్లు రానుంద‌ని తెలిపారు. దీంతో సీట్ల పెంపు ఉండ‌బోద‌ని నిరాశ‌లో ఉన్న రాజ‌కీయ నాయ‌కుల్లో మ‌ళ్లీ కొత్త ఆశ‌లు చిగురించాయి.

అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లు పాసైతే ఏపీలో స్థానాలు 175 నుంచి 225 కు పెరుగుతాయి. ఇక తెలంగాణ‌లో 119 నుంచి 150 కి పెరుతుతాయి. ఈ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే జంపింగుల‌కే కాదు….. ఇత‌రుల‌కు కూడా సీట్లు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

ముఖ్యంగా జంపింగ్ ఎమ్మెల్యేలైతే ఇప్పుడు ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఆ బిల్లు పాసైతే.. ఇక రంగం సిద్ధం చేసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. మ‌రి వీళ్ల కోరిక ఈ సెషన్ లోనే నెర‌వేరుతుందా? లేక ష‌రామామూలుగానే అది పెండింగ్ లో ప‌డుతుందా? చూడాలి.

SHARE