నిజమో కాదో గూగుల్‌ చెప్పేస్తుంది….

0
536
google fast check

 Posted [relativedate]

google fast checkఏదైన వార్త తెలిస్తే అది నిజమా కాదా అనే సందేహంలో కొంత మంది టెక్‌ ప్రియులు వెంటనే దాన్ని గూగుల్‌ చేసి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. కాని అది నిజమా కాదా అని ఎవరు నిర్దారిస్తారు అనే ప్రశ్నకు సమాధానం ఉండదు.. దీంతో ఎక్కడ లేని కన్యుఫ్యీజన్‌ క్రియేట్‌ అవుతూ ఉంటుంది. దీనికి చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ ఒక అడుగు ముందుకేసింది.సెర్చ్‌ కంటెంట్‌లో ఫ్యాక్ట్‌ చెక్‌ అనే ఫీచర్‌ని పరిచయం చేస్తుంది. ప్రతి అంశం పక్కన ఫ్యాక్ట్‌చెక్‌ అని చూపెడుతుంది.

ప్రస్తుతం గూగుల్‌ న్యూస్‌ అండ్‌ వెదర్‌ ఐవోఎస్‌, ఆండ్రాయిడ్‌ యాప్స్‌లో ఫ్యాక్ట్‌చెక్‌ ట్యాగ్‌తో అమెరికా, యూకేలలో యూజర్లుకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. త్వరలో మిగిలిన దేశాల్లోనూ విస్తరించడనుంది. దీంతో స్పష్టమైన సమచారం కోరుకుంటూ గంటల తరబడి వెబ్‌లో వెతికే వారికి పెద్ద ఊరటే.. ప్రపంచ నలుమూలల నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌ల పేరుతో.. వివిధ రకాల ఆర్టికల్‌ వచ్చేవాటిలో ఏది నిజమో కాదో తెలియని సందిగ్ధం ఉంటుంది కాబట్టి న్యూస్‌ కచ్చితత్వంపై పనిచేస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది. ముఖ్యంగా ఆరోగ్య, రాజకీయ సమాచారం విషయాలలో ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు పేర్కొంది.

 

Leave a Reply