Monday, September 26, 2022
HomeEntertainmentCinema Latestఅనుకున్నదే అయ్యింది.. చివరి నిమిషంలో షాక్‌

అనుకున్నదే అయ్యింది.. చివరి నిమిషంలో షాక్‌

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

గోపీచంద్‌, నయనతార జంటగా బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. దాదాపు అయిదు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమా ఎట్టకేలకు పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయ్యింది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నేడు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఈ చిత్ర నిర్మాత తనకు ఆరు కోట్ల రూపాయలు ఇవ్వాలని, ఆ మొత్తం ఇచ్చిన తర్వాతే సినిమా విడుదల అవుతుందని ఫైనాన్సియర్‌ ఓపెన్‌గానే చెప్పాడు. దాంతో చిత్రం విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయినా కూడా సినిమా విడుదలపై ఎలాంటి అపనమ్మకం పెట్టుకోవద్దని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతూ వచ్చారు. సినిమా నేడు విడుదల కానుంది అంటూ థియేటర్లలో పోస్టర్లు కూడా వేశారు.

గత వారం రోజులుగా జోరుగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ‘ఆరడుగుల బుల్లెట్‌’ చిత్రం ఎలా ఉంటుందో చూడాలని, గోపీచంద్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆశించారు. బి గోపాల్‌ దర్శకత్వంలో గతంలో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చాయి. దాంతో కూడా ఈ సినిమాపై ఆసక్తి కలిగింది. ఉదయాన్నే సినిమా కోసం అని థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు చివరి నిమిషంలో సినిమా క్యాన్సిల్‌ అయ్యిందనే వార్త అందింది. దాంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. సినిమా ఇక విడుదల అయ్యేది కష్టమే అని, ఆ సినిమా పర్మినెంట్‌గా ల్యాబ్‌కు పరిమితం కావాల్సిందే అంటూ విశ్లేషకులు అంటున్నారు.

- Advertisment -
spot_img

Most Popular