Sunday, July 3, 2022
HomeEntertainmentCinema Latestదూకుడు చూస్తుంటే విడుదల అయ్యేట్లే ఉంది!

దూకుడు చూస్తుంటే విడుదల అయ్యేట్లే ఉంది!

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గోపీచంద్‌ హీరోగా నయనతార హీరోయిన్‌గా బి గోపాల్‌ దర్శకత్వంలో దాదాపు అయిదు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్టు’. ఈ చిత్రం ఎట్టకేలకు షూటింగ్‌ను పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని, సెన్సార్‌ కార్యక్రమాలు చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. అయితే అన్ని అనుకున్నట్లుగా జరగడం కాస్త కష్ట అని నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది.

ఈ చిత్ర నిర్మాత సి కళ్యాణ్‌ చిత్ర నిర్మాణం కోసం 6 కోట్ల అప్పును ఒక ఫైనాన్సియర్‌ వద్ద తీసుకున్నాడని, ఆయన ఆ అప్పును చెల్లిస్తేనే సినిమా విడుదల అవ్వనిస్తాను అంటూ చెబుతున్నాడు. దాంతో సినిమా విడుదల అవ్వడం అసాధ్యం అంటూ సినీ వర్గాల వారు అనుకుంటున్నారు. ఒక వైపు ఫైనాన్సియర్‌ ఒత్తిడి తీసుకు వస్తున్నా సినిమా ప్రమోషన్‌ను మాత్రం భారీగానే చేస్తున్నారు. రేపు ఎట్టి పరిస్థితుల్లో బొమ్మను థియేటర్లలో దించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పబ్లిసిటీ మరియు సందడి చూస్తుంటే తప్పకుండా రేపు గోపీచంద్‌ సినిమా విడుదల అయ్యేట్లుగానే కనిపిస్తుంది.

- Advertisment -
spot_img

Most Popular