‘బలం’ కాదు ‘బుల్లెట్’….

0
294
gopichand nayanatara movie title bullet

 Posted [relativedate]

gopichand nayanatara movie title bulletహీరో గోపీచంద్ కి ఓ సెంటిమెంట్ ఉంది.ఆయన సినిమా టైటిల్స్ సున్నాతో ఎండ్ అయ్యేలా చూసుకుంటాడు.’రణం’ నుంచి ఆ ‘సున్నా’ సెంటిమెంట్ కంటిన్యూ అవుతూ వస్తోంది. సాహసం, లౌఖ్యం సౌఖ్యం.. సినిమాల్లో సున్నా సెంటిమెంట్ ని ఫాలో అయ్యాడు గోపీ.

అయితే,ఇప్పుడు అప్పుడెప్పుడో ఆగిపోయిన సినిమాని తీసి దానికి సున్నా సెంటిమెంట్ తగిలించి రిలీజ్ చేసేందుకు గోపీ రెడీ అవుతున్నట్టు ప్రచారం జరిగింది. సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్-నయనతార జంటగా చాన్నాళ్ల క్రిందటే.. ఓ సినిమా తెరకెక్కింది.రమేష్ నిర్మాత. అయితే,కొన్ని కారణాల వల్ల అది ల్యాబ్ నుంచి బయటకు రాలేదు. ఇప్పుడు గోపీచంద్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.పైగా సినిమాలో నయన్ కూడా ఉంది.దీంతో..సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి..కాసిన్ని కాసులు కురిపిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక-నిర్మాతలు

ప్రస్తుతం టైటిల్స్ వేట కొనసాగుతోంది. ‘బలం’ టైటిల్ ని ఫిక్స్ చేశారనే వార్తలొచ్చాయ్. అయితే,ఇప్పుడీ టైటిల్ ని ‘బుల్లెట్’ గా మార్చినట్టు సమాచారమ్. మరి.. గోపీచంద్ ‘బుల్లెట్’ ఏ మేరకు దూసుకెళ్తుందో చూడాలి

ఇదిలావుండగా..గోపీచంద్ ‘ఆక్సీజన్’ రిలీజ్ కి రెడీ అవుతోంది.ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న’ఆక్సిజన్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దీంతో పాటు.. సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు గోపీ. ఈ సినిమా టైటిల్ గా ‘ఆరుడగుల బుల్లెట్’ టైటిల్ ప్రచారంలో ఉంది.

Leave a Reply