
చిత్ర నిర్మాతలు జె.పుల్లారావు౼జె.భగవాన్ లు మాట్లాడుతూ.. “గోపీచంద్ లో ఉన్న మాస్ యాంగిల్‌ను సరికొత్తగా ప్రజెంట్ చేసే చిత్రమిది. ఇది వరకు ఆయన చేసిన చిత్రాల కంటే హై బడ్జెట్, హై టెక్నికల్ అంశాలతో ఈ సినిమాను ప్రెస్టిజియస్ గా రూపొందించనున్నాం. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బెస్ట్ టీంతో సినిమాను అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తాం“ అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో గోపీచంద్, క్యాథరిన్, శరత్ మరార్, సుధాకర్ రెడ్డి, నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
ముఖేష్ రుషి, నికితన్ ధీర్(తంగబాలి), అజయ్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కో డైరెక్టర్: హేమాంబర్ జాస్తి, ఆర్ట్: కడలి బ్రహ్మ, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు,సంగీతం: ఎస్.ఎస్.థమన్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది.