గోపీచంద్, సంపత్ నంది ల  కొత్త చిత్రం.. 

0
756

gడిఫ‌రెంట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్స్‌ లో న‌టిస్తూ త‌న‌కంటూ మాస్ హీరోగా  ప్ర‌త్యేకత‌ను సంపాదించుకున్నాడు గోపీచంద్. `య‌జ్ఞం`, `ఆంధ్రుడు`, `ల‌క్ష్యం`, `శౌర్యం`, `శంఖం`, `గోలీమార్` జిల్ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు `ఆక్సిజ‌న్` అనే మరో డిఫ‌రెంట్ యాక్ష‌న్ చిత్రంలో నటిస్తున్న గోపీచంద్ హీరోగా హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. `ఏమైంది ఈవేళ` అనే యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్‌తో స‌క్సెస్ కొట్టి త‌ర్వాత మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌తో `ర‌చ్చ` అనే సెన్సేష‌న‌ల్ హిట్ సాధించ‌డ‌మే కాకుండా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను `బెంగాల్ టైగ‌ర్` అంటూ స‌రికొత్త యాంగిల్‌లో ప్రెజంట్ చేసిన స్టార్ డైరెక్టర్ సంప‌త్ నంది. ఈ మూడు చిత్రాలను మూడు డిఫరెంట్ ఫార్మేట్స్ లో నిర్మించి హ్యాట్రిక్ సాధించిన దర్శకుడు సంపత్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.పుల్లారావు౼జె.భగవాన్  నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు జె.పుల్లారావు౼జె.భగవాన్ లు  మాట్లాడుతూ.. “గోపీచంద్ లో ఉన్న మాస్ యాంగిల్‌ను సరికొత్త‌గా ప్ర‌జెంట్ చేసే చిత్ర‌మిది. ఇది వ‌ర‌కు ఆయ‌న చేసిన చిత్రాల కంటే హై బ‌డ్జెట్, హై టెక్నిక‌ల్  అంశాలతో ఈ సినిమాను ప్రెస్టిజియ‌స్ గా రూపొందిస్తాం. సంప‌త్ నంది సూప‌ర్బ్ క‌థ చెప్పారు. కథలో భాగంగా చిత్రీకరణ విదేశాల్లో జరుపుతాం. ఈ క‌థ‌కు గోపీచంద్‌ అయితే స‌రిపోతార‌ని ఆయ‌న్ను అడ‌గ‌టం, ఆయ‌న స‌రేన‌న‌డం జ‌రిగింది. అందుకు ఆయ‌న‌కు థాంక్స్‌. గోపీచంద్‌లో మ‌రో స‌రికొత్త మాస్ యాంగిల్‌ను ఈ చిత్రంలో చూస్తారు. కొంత మంది టెక్నిషియ‌న్స్ ఫైన‌లైజ్ అయ్యారు. త్వరలోనే మిగిలిన టెక్నీషియన్స్ పేర్లు కూడా తెలియజెస్తాం“ అన్నారు.

గోపీచంద్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోలర్ః బెజ‌వాడ కోటేశ్వ‌ర‌రావు, ఎడిట‌ర్ః గౌతంరాజు, సినిమాటోగ్ర‌ఫీః ఎస్‌.సౌంద‌ర్ రాజ‌న్‌, ఆర్ట్ః ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్: రామ్౼లక్ష్మణ్, స్క్రిప్ట్ కో ఆర్టినేటర్: సుధాకర్ పావులూరి, నిర్మాతలుః జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: సంప‌త్ నంది.

Leave a Reply