Saturday, May 8, 2021
HomeEntertainmentCinema Latest5 సంవత్సరాల తర్వాత కూడా మోక్షం కలిగేలా లేదు

5 సంవత్సరాల తర్వాత కూడా మోక్షం కలిగేలా లేదు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

గోపీచంద్‌ హీరోగా బి గోపాల్‌ దర్శకత్వంలో దాదాపు అయిదు సంవత్సరాల క్రితం ఒక సినిమా ప్రారంభం అయ్యింది. ఆర్థిక కారణాల వల్ల సినిమా పూర్తి కాలేదు. ఎట్టకేలకు సినిమాను పూర్తి చేసి, ఆడియో విడుదల చేసి, సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసి ఈనెల 9న ఈ ‘ఆరడుగుల బుల్లెట్‌’ను విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు. కాస్త ఆలస్యం అయినా కూడా సాఫీగా సినిమా విడుదలవుతుందని భావిస్తున్న తరుణంలో వివాదం మొదలైంది. సినిమా విడుదల అయ్యేది దాదాపు అసాధ్యం అన్నట్లుగా వివాదం ముదిరి పాకాన పడటం జరిగింది.

‘ఆరడుగుల బుల్లెట్‌’ చిత్రాన్ని సి కళ్యాణ్‌ నిర్మించాడు. ఆ సినిమా నిర్మాణం కోసం నిర్మాత ఒక ఎన్నారై వద్ద దాదాపు 6 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నాడట. ఇప్పుడు సినిమా విడుదల అవుతున్న సమయంలో ఆ డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా ఎన్నారై నిర్మాతను కలిశాడు. కాని నిర్మాత మాత్రం ఇప్పుడు తన వద్ద లేవు అంటూ చేతులెత్తేశాడు. దాంతో సదరు ఎన్నారై పోలీసులను ఆశ్రయించాడు. సినిమా విడుదల కాకుండా స్టే తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన డబ్బును తిరిగి చెల్లించిన తర్వాతే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నారై పోలీసు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. దాంతో గోపీచంద్‌ ఆరడుగుల బుల్లెట్‌కు ఇప్పటికి అయినా మోక్షం దక్కేలా లేదని సినీ వర్గాల వారు అంటున్నారు.

spot_img

Most Popular