ఆ మాష్టారి కోసం విద్యార్థులు కదిలారు..

5384

 Posted November 1, 2016, 8:04 am

gorantla ravikumar join tdp ongole tdp party leaders students are supported
ఆఫీస్ లో బాస్…మనకు చదువు చెప్పిన మాష్టారు ….వీళిద్దరి క్లాసులు,తిట్లు,సూచనలు సలహాలు ఎవరికైనా సహజం …వాటి గురించి అప్పటికప్పుడు ఏమనిపించినా …జీవితంలో ఓ కష్టం ఎదురైనప్పుడో? ఊహించని విజయం సొంతమైనపుడో గుర్తుకు వచ్చాయంటే …గతంలో విన్న మాటలు,అవి చెప్పిన వ్యక్తులు గుర్తుకి వస్తే ….మనకేది అవసరమో వాళ్లకి ముందే తెలిసిపోయినట్టు. కానీ మనకది అర్ధం కావడానికి చాలా సమయం పట్టొచ్చు.ఆ కాస్త అర్ధమయ్యాక అరెరే అప్పట్లో ఆయన్ని తప్పుగా అనుకున్నామే అని బాధపడతాం..అవకాశమొస్తే వారిని కలిసి కృతజ్ఞతలు చెపుతాం.అయినా ఋణం తీరదనిపిస్తే ఇంకో అడుగు ముందుకేసి వారి లక్ష్యం కోసం మన వంతు సాయం చేస్తాం.ఇది మన గొప్పదనం కాదు ..మనల్ని ఇంతగా ప్రభావితం చేసిన ఆ గురువుల గొప్పదనం.అలాంటి సందర్భం ఇప్పుడు ఓ గురువు విషయంలో కనిపిస్తోంది.అది కూడా ఇప్పుడున్న రోజుల్లో .వివరాల్లోకి వెళితే ..

గోరంట్ల రవికుమార్ ..ప్రకాశం జిల్లాలో ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి.తండ్రి మరణం ..తల్లి కష్టం చిన్న వయసులోనే చూసిన మనిషి.ఆంధ్ర యూనివర్సిటీ లో ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ చేశారు.లెక్చరర్ గా ప్రస్థానం మొదలెట్టిన అయన ఓ గురువుగా పాఠాలకి మాత్రమే పరిమితం కాలేదు.తనకు తెలిసిన జీవిత పాఠాలు నేర్పేందుకు కృషి చేశారు.ఆ తర్వాత అయన స్థాపించిన హర్షిణి విద్యాసంస్థల్లోనూ ఆయనది అదే ఒరవడి.ఎంత కష్టమైనా తెలివైన పేద విద్యార్ధులకి ఉచితంగా తమ కాలేజీ లో చేర్చుకోడానికి అయన ఎన్నడూ వెనకడుగు వేయలేదు. ఒంగోలు లో హర్షిణి విద్యాసంస్థలు పాతుకునే సమయంలోనే రవి కుమార్ కి ఓ ఆలోచనవచ్చింది..గ్రామీణ ప్రాంతాల్లో తెలివైన విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం వల్ల కెరీర్ లో వెనకపడకూడదని అనుకున్నారు.ఆ లోపాన్ని అధిగమించడానికి తన వంతు ప్రయత్నం చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఆ లోపాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ విధానాల్లోనే ప్రాధాన్యత పెరగాలని భావించారు.

అందుకనే రాబోయే పట్టభద్రుల నియోజకవర్గంలో ఒంగోలు ,నెల్లూరు,చిత్తూర్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీ గా పోటీ చేయాలని తలపోస్తున్నారు.అధికార టీడీపీ నేతల సాయంతో టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.ఈ పరిస్థితుల్లో ఒకప్పటి అయన శిష్యులంతా సోషల్ మీడియా ద్వారా ఏకమై …గురువు గారికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు.ఇప్పటికే సమర్ధ అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్న టీడీపీ నాయకత్వానికి ఆ మాష్టారి శిష్యుల ద్వారా ఆయనేమిటోతెలుసుకుంటోంది.బాబుకి సన్నిహిత మంత్రి అనుచరుడిని కాదని మరీ గోరంట్ల రవి కుమార్ కి టికెట్ ఇచ్చేందుకు టీడీపీ సిద్ధపడితే అయన గెలుపుకి కూడా అలుపెరగని కృషి చేస్తామంటున్నారు ఆ మాష్టారి శిష్యులు.ఏదేమైనా ఆ శిష్యుల ప్రయత్నం ఫలిస్తే ఇదో సరికొత్త గురుదక్షిణ అవుతుంది.ఏమంటారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here