వాట్సప్‌ వీడియో కాలింగ్‌ కి యాక్టివేషన్‌ లింక్స్‌ అవసరమా…!

0
408

Posted [relativedate]

beware-whatsapp-video-calling-scam
ఇప్పుడు ఏ వాట్సప్‌ గ్రూపుల్లో చూసిన.. వ్యక్తిగత మెజెస్‌లు చూసినా.. ‘మీరు వాట్సప్‌ వీడియో సౌకర్యం కావాలంటే ఈ లింక్‌ని క్లిక్‌ చేయండి’ అంటూ ఒక లింక్‌ పొందు పరుస్తూ చెక్కర్లు కొడుతుంది. దానితోపాటు ఇలా యాక్టివేట్‌ చేసుకున్నవారికే వీడియోకాలింగ్‌ సౌకర్యం వస్తుంది లేదంటే రాదు అని అందులో పేర్కొంటున్నారు. అవన్నీ ఫేక్‌ లింక్సే.. వాట్సప్‌ పేరుతో వచ్చే నకిలీ లింకులే.. వీడియో కాలింగ్‌ సౌకర్యం కావాలంటే కేవలం అప్‌డేట్‌ చేస్తే సరిపోతుంది. గూగుల్‌ ప్లేస్టోర్‌కి వె ళ్లి అప్‌డేట్‌ అని కొడితే వాట్సప్‌తో అందిస్తున్న అన్ని ఫీచర్లు ఆటోమేటిగ్గా ఎనేబుల్‌ అవుతాయి. అంతే తప్పా ప్రత్యేకంగా ఎటువంటి క్లిక్స్‌ చేయాల్సిన అవసరం లేదు.

.
వీడియో కాల్‌ చేయడమెలా..
అప్‌డేట్‌ చేసుకున్న కొందరికి వీడియో కాల్‌ చేయాలంటే వీలుపడదు.. అంత మాత్రన మన యాప్‌కి యాక్టివ్‌ కాలేదని కాదు.. మీరు ఎవరికైతే కాల్‌ చేస్తున్నారో ఆ వ్యక్తి వాట్సప్‌ యాప్‌ని అప్‌డేట్‌ చేసుకోలేదని అర్థం.. అంతే తప్పా వీడియో కాల్‌ రాలేదని కాదు.. ఏదైనా కాంటాక్ట్‌కి వెళ్లి పైన ఉన్న కాలింగ్‌ సింబల్‌ని క్లిక్‌ చేస్తే వీడియో లేదా ఆడియో అని అడిగిందంటూ మీది అప్‌డేటెడ్‌ వర్షన్‌.. మొదట్లో కేవలం బీటా వర్షన్లకే ఇచ్చారు కాబట్టి ప్రత్యేకంగా బీటా వర్షన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు ఆ సమస్య లేకుండా నేరుగా గూగుల్‌ ప్లే ద్వారా ఆండ్రాయిడ్‌ మొబైల్స్‌ అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోతుంది

fake-whatsapp-video-call-invitation
వ్యక్తి గత సమాచారమే లక్ష్యం..
ఇప్పుడు వాట్సప్‌లో చక్కర్లు కొడుతున్న యాక్టివేషన్‌ మెజేస్‌ నకిలీది.. వాటిని క్లిక్‌ చేస్తే వెంటనే మరో నలుగురు స్నేహితులకు షేర్‌ చేయండి మీ వీడియో కాలింగ్‌ సౌకర్యం ఎనేబుల్‌ అవుతుంది అని చూపుతుంది. దాంతో మరో నలుగురి నంబర్లకు ఆ మెసెజ్‌ వెళుతుంది. ఇలా చేయడం వల్ల క్షణాల్లో మన ఫోన్‌ హ్యాక్‌ చేసే అవకాశం ఉంది. రాన్సమ్‌వేర్‌ వంటి మాల్‌వేర్‌ బారిన కూడా పడే అవకాశం ఉంది.. దాంతో మీ వ్యక్తిగత సమాచారం మొత్తం లాక్‌ అయి వారి చేతికి చేరుతుంది. కొందరు వెబ్‌సైట్‌ ట్రాఫిక్‌ కోసం చేస్తారు.. ఎక్కువ మంది ఆయా వెబ్‌సైట్లకు వెళితే యాడ్స్‌ రూపంలో వచ్చే ఆదాయం సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. దానితోపాటు కొన్ని మాల్‌వేర్స్‌ ఎంటర్‌ చేసే ప్రమాదమూ లేకపోలేదు.. అందుకే నేరుగా అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోతుంది.

Leave a Reply