అద్దంకి ఎమ్మెల్యే చతురుడే..

  gottipati ravi replay fb post comment
కరణం బలరాం లాంటి సీనియర్ నాయకుడిని సమర్ధంగా ఢీకొడుతున్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్. మంచి చతురుడే. రాజకీయ ప్రత్యర్థిని ఎదుర్కొనే క్రమంలో ఏకంగా ముఖ్యమంత్రి కుమారుడ్ని అద్దంకి నుంచి పోటీకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇటు రాజకీయాల్లో అటు వ్యాపార రంగంలో బిజీ గా వుంటూ కూడా సోషల్ మీడియా లోను చురుగ్గా వ్యవహరిస్తారు రవి.రీసెంట్ గా అయన వైసీపీ నుంచి టీడీపీ లోకి వచ్చిన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలతో తీయించుకున్న ఫోటో ని ఫేస్ బుక్ లో పెట్టారు. అభిమానుల నుంచి పాజిటివ్ కామెంట్స్ సహజమే కదా! నెగటివ్ కామెంట్స్ కూడా తప్పవు.

అలాగే ఓ కుర్రోడు …. బాగా పెట్టుకోండి ఇలాంటి ఫోటోలు…2019 లో మీరెటు MLA గా గెలవరని కౌంటర్ వేశాడు. సహజంగా ఇలాంటి విమర్శల్ని పట్టించుకోరు రాజకీయనేతలు. చూసీచూడనట్టుంటారు. కానీ ఆ కామెంట్ కి రవి కౌంటర్ వేశారు. కామెంట్ చేసిన కుర్రోడు ఫేస్ బుక్ లో బైక్ మీద కూర్చున్న ఫోటో వుంది. దాన్ని ఉద్దేశిస్తూ ముందు నువ్వు బైక్ మీద జాగ్రత్తగా కూర్చో …లేకుంటే పడతావ్ అని హితవు చెప్పాడు. నీ సంగంతి నువ్వు చూసుకో…నా సంగతి నాకు తెలుసులే అని చెప్పకుండా చెప్పి…విమర్శించే వాడికి హితబోధ చేసినట్టే చేసి కౌంటర్ ఇచ్చిన రవి చతురుడే..కాదంటారా ?

SHARE