ఒకరిపట్ల మరొకరికి అపారస్నేహ భావం,గౌరవం వున్న బాలకృష్ణ ,మోహన్ బాబు నిజంగానే ఢీ కొనబోతున్నారు.అయితే వీరి పోటీ బాక్సాఫీస్ దగ్గరకాదు.క్రిష్ దర్శకత్వంలో వస్తున్న బాలయ్య వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణిలో మోహన్ బాబు కూడా ఒక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం..పైగా ఈ ఇద్దరూ ఓ యుద్ధ సన్నివేశంలో ఢీ కొట్టబోతున్నారట.బాలయ్య వందో సినిమాలో ఇలాంటి అవకాశం రావడం మీద మోహన్ బాబు సంతోషం గా ఉన్నారట….వీళ్లద్దరూ గతంలో భలేదొంగ,ప్రాణానికి ప్రాణం,పాండురంగడు వంటిచిత్రాల్లో ఇద్దరూ కలసి నటించారు.