శాతకర్ణి టీజర్ రెస్పాన్స్ ..

Posted October 12, 2016

 gouthami putra sathakarni teaser response
గౌతమీపుత్ర శాతకర్ణి….ఈ సినిమాని 100 వ చిత్రంగా బాలయ్య ఎంచుకొన్నపుడు ఎన్నో నొసళ్ళు చిట్లించాయి.బాలయ్య అభిమానులు సైతం బోయపాటి లాంటి కమర్షియల్ డైరెక్టర్ అయితే బాగుంటుందని ఆశించారు.కానీ బాలయ్య శాతకర్ణి వైపు ఎందుకు మొగ్గాడో?క్రిష్ కి ఎందుకు అవకాశం ఇచ్చాడో దసరా రోజు అందరికీ అర్ధమైంది.బాలయ్యని ఆడిపోసుకునే వెబ్ సైట్స్ సైతం శాతకర్ణి టీజర్ ని ఆకాశానికెత్తేశాయి.క్రిష్ టేకింగ్ ని..బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ ని..వాటిని బాలయ్య పలికిన తీరుని అందరూ మెచ్చుకుంటున్నారు.

ఇక విజువల్స్,గ్రాఫిక్ వర్క్ కూడా తెలుగు సినిమా ప్రమాణాల్ని పెంచే దిశగానే కనిపించాయి..ఏమైతేనేమి దసరా నాడు విడుదలైన టీజర్ తో శాతకర్ణి అందరి సందేహాలు తీర్చేసాడు.టీజర్ చూసాక సినిమా బిజినెస్ క్రేజ్ పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.వాళ్ళు వీళ్ళు అని లేకుండా అందరూ శాతకర్ణి టీజర్ కెవ్వుకేక అంటున్నారు.చిత్ర యూనిట్ కూడా ఫుల్ ఖుషీ అంట.ఇక క్రిష్ అయితే ఓ మాస్ హీరోతో సినిమా చేస్తే టీజర్ కే రెస్పాన్స్ వస్తుందా అని ఆశ్చర్యపోతున్నాడట.

[wpdevart_youtube]ouXn5CK0wTU[/wpdevart_youtube]

SHARE