జన్ ధన్ కు 10 పదివేలట

0
314
pmjdylogo

Posted [relativedate]

 

 

pmjdylogo

మోదీ సర్కారు.. త్వరలో మరో షాకింగ్‌ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు సమాచారం అదేంటంటే జీరో అకౌంట్స్ లో ప్రభుత్వమే పదివేలు వేస్తుందట…అయితే అది కొందరికి మాత్రమే శుభవార్త

జీరో బ్యాలెన్స్‌ ఉన్న ప్రతి జన్‌ ధన్‌ ఖాతాలోనూ ప్రభుత్వమే రూ.10 వేలు జమ చేయాలనే యోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి.. అదే సమయంలో, చేతిలో డబ్బు లేక తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న పేద ప్రజానీకానికీ ఇద్దరికీ మేలు చేసే చర్య ఇది అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం. దేశవ్యాప్తంగా ప్రజలు తెరిచిన 25 కోట్ల జన్‌ ధన్‌ ఖాతాల్లో 5.8 కోట్ల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా లేదు. ఆ ఖాతాలన్నిటిలో రూ.10 వేల చొప్పున వేయడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు.. రూ.58 వేల కోట్లు. వినడానికి ‘అమ్మో అంత సొమ్మా’ అనిపించవచ్చుగానీ.. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రభుత్వానికి రూ.3 లక్షల కోట్ల మేర లబ్ధిని పరిగణనలోకి తీసుకుంటే అది పెద్ద విషయమే కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది కొంతమేర రాజకీయ ఎత్తుగడ గ భావించ వచ్చు .

Leave a Reply