Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. సాక్షాత్తూ వైకుంఠనాథుడే కొలువైన తిరుమలగిరులు ప్రశాంత ప్రకృతికి ఆలవాలం. ఇక్కడ ఎంత సమ్మర్ లో అయినా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఏసీ లేకపోయినా.. అంతకు మించిన శీతల పవనాలు వీస్తాయి. కానీ ఇదంతా గతం. ఇప్పుడు తిరుమల కూడా వేడెక్కుతోంది. భక్తుల ట్రాఫిక్, వాహనాల కాలుష్యంతో పొగచూరుతోంది.
తిరుపతి నుంచి తిరుమల వెళ్లాలంటే రోడ్డు మార్గం ఒక్కటే దిక్కు. దీంతో రోజూ వేలాది సంఖ్యలో వాహనాలు వస్తూపోతుంటాయి. వీటి కాలుష్యం ఏఢుకొండలు దాటి శ్రీవారి సన్నిధికి చేరుతోంది. దీంతో అక్కడ భక్తులు, పూజారులు ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య నివారణ కోసం అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం రకరకాల మార్గాలు అన్వేషించారు.
తిరుమలకు రైలు మార్గం వేయాలని గతంలో ప్రతిపాదన వచ్చినా.. సెక్యూరిటీ ప్రాబ్లమ్ తో కార్యరూపం దాల్చలేదు. రోప్ వే ను ఆగమ పండితులు వ్యతిరేకించారు. దీంతో చచ్చినట్లు అందరూ రోడ్డు మార్గమే ఉపయోగించాల్సి వస్తోంది. కానీ వాహనాల కాలుష్యానికి విరుగుడుగా.. బ్యాటరీ వాహాలు నడపాలని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రతిపాదన అమలైతే.. తిరుమల స్వచ్ఛంగా మారిపోవడం ఖాయం.