గవర్నర్ పుష్కర స్నానం..ఏర్పాట్లపై సంతృప్తి .

  governor narasimhan family satisfied vijayawada pushkaralu

కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పుణ్యస్నానమాచరించారు. బుధవారం ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరిన నరసింహన్ కొద్దిసేపటికి విజయవాడ చేరుకున్నారు. గవర్నర్ కు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘనంగా స్వాగతం పలికారు.

కృష్ణా నదీ తీరంలో ఏర్పాటు చేసిన పున్నమి ఘాట్ కు గవర్నర్ ను ఆయన తీసుకుని వెళ్లారు. పుష్కర స్నానం చేయడం అదృష్టమని, ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయని గవర్నర్ అన్నారు. ఆ తర్వాత సతీసమేతంగా నరసింహన్ పుష్కర స్నానం చేశారు. తరువాత ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను గవర్నర్ దంపతులు దర్శిచుకున్నారు. 

SHARE