బాలీవుడ్ : గోవిందా, శిల్పాశెట్టిలు అరెస్ట్

0
394
govinda shilpa shetty arrest chote sarkar movie Ek Chumma Tu Mujhko song

 Posted [relativedate]

 govinda shilpa shetty arrest chote sarkar movie Ek Chumma Tu Mujhko song

బాలీవుడ్ హీరో-హీరోయిన్ ని పాత కేసు కొత్తగా పలకరించింది. 1996లో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘ఛోటే సర్కార్’. విమల్ కుమార్ దర్శకుడు-నిర్మాత.గోవిందా-శిల్పాశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఓ మోస్తారు ఆడింది. అయితే, ఇందులోని డ్యూయెట్ సాంగ్ పై అప్పట్లో తీవ్ర విమర్శలొచ్చాయ్. ఇందులో “‘ఏక్ ఛుమ్మా తు ముఝ్‌కో ఉదార్ దేదే, ఔర్ బద్లేమే యూపీ బీహార్ లేలే..’ (నువ్వు నాకు ఉదారంగా ఓ ముద్దు ఇచ్చి, దానికి బదులుగా యూపీ, బీహార్తీసుకో)” అంటూ ఈ పాట లిరిక్స్ వుండటమే ఈ విమర్శలకి కారణం.ఈ పాట ద్వారా బీహార్‌ని కించపర్చారు అంటూ జార్ఖండ్‌కి చెందిన న్యాయవాది కోర్టుకెక్కారు.

పలు వాయిదాల తర్వాత ఈ కేసు మళ్లీ ఈ  యేడాది జూన్ 30నవిచారణకి వచ్చింది. ఈ సినిమాలలో హీరో-హీరోయిన్ గా నటించిన గోవిందా-శిల్పా శిట్టిలు కోర్టుకు హాజరుకావాలంటూ పలుమార్లు న్యాయం స్థానం ఆదేశించింది.ఆఖరి అవకాశం అంటూ జులై 20 తేది వరకు గడువు కూడా విధించారు.అయినా ఈ జంట కోర్టుకు హాజరుకాలేదు. దీంతో..వీరిపై  అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయితే, ఇప్పటి వరకు వీరిపై చర్యలేమీ లేవు. ఇంకో అవకాశంగా వీరి కేసు ఈరోజు (అక్టోబర్ 18)న మరోసారి విచారణకు రానుంది. ఈ రోజు గోవిందా-శిల్పాశెట్టిలు కోర్టుకు హాజరు కావాల్సివుంది. లేని యేడల వీరిద్దరిని అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. ఈ జంట ఈరోజైనా.. కోర్టు మెట్లు ఎక్కుతుందో.. ? లేదో.. ?? చూడాలి.

Leave a Reply