నగదు రహిత భారతం కోసం రాయితీల మేళా…

Posted December 9, 2016

Govt announces smart discounts on online paymentsభారత దేశాన్ని నగదురహితంగా మార్చేందుకు డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాయితీలను కేంద్రం ప్రకటించింది. కొనుగోళ్లు, చెల్లింపుల కోసం కార్డులు, ఇతర డిజిటల్‌ మాధ్యమాలు వాడేవారికి మోస్తరు నుంచి భారీస్థాయిలో మినహాయింపులు ఇవ్వనున్నట్లు ఆర్థికమంత్రి చెప్పారు. డిజిటల్‌ గేట్ వే ల ద్వారా చెల్లించేవారికి బోలెడు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు ..

** పెట్రోలు, డీజిల్‌, రైలు టిక్కెట్లు, ఇతర రైల్వే సేవలు, బీమా, టోల్‌లాంటి వాటిలో రాయితీలు, రైలు టిక్కెట్లు ఆన్‌లైన్‌ ద్వారా కొనగోలు చేసినవారికి రూ.10లక్షల ప్రమాద బీమా ఉచితం.

** ఆహారం, వసతి, విశ్రాంతి గదులు తదితర సేవలకు సంబంధించిన సేవలపై కూడా డిజిటల్‌ చెల్లింపులు జరిపిన వారికి 5 శాతం రాయితీ.

** సబర్బన్‌ రైల్వేల్లో సీజనల్‌ టిక్కెట్లు 0.5 శాతం రాయితీ.

** పెట్రోల్‌, డీజీల్‌ కొనుగోళ్లలో 0.75శాతం రాయితీ.

**గ్రామీణ ప్రాంతాల్లో నగదురహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు పదివేలకు మించి జనాభా ఉన్న లక్ష గ్రామాలకు రెండేసి పీఓఎస్‌ పరికరాలు సరఫరా.

** 4.32కోట్ల మంది కిసాన్‌ క్రెడిట్‌ కార్డుదారులకు రూపే కిసాన్‌ కార్డులు జారీ చేయడంలో గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులకు నాబార్డ్‌ ద్వారా తోడ్పాటు.

**సాధారణ బీమాలపై ప్రీమియంలో 10 శాతం.. జీవిత బీమాలపై 8 శాతం రాయితీగా గానీ, అప్పుగా గానీ ప్రభుత్వ రంగ బీమా సంస్థలు.. ఆయా సంస్థల వెబ్‌సైట్ల ద్వారా చెల్లింపులు చేసినవారికి అందిస్తాయి

**కేంద్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు డిజిటల్‌ మాధ్యమంలో చెల్లించే వినియోగదారులపై లావాదేవీ రుసుము, ఎమ్‌డీఆర్‌ రుసుములాంటివి మోపకుండా ఖర్చును భరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

** ఇదే విధానం అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా.

** ఇప్పటికే పీఓఎస్‌ పరికరాలు వాడుతున్న వ్యాపారుల నుంచి నెలకు రూ.100కు మించి అద్దె వసూలు చేయకూడదని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం సూచన.

** రూ.2000కు మించని డిజిటల్‌ లావాదేవీలపై సేవల పన్నును కూడా మినహాయించింది. జాతీయ రహదారుల వద్ద టోల్‌ చెల్లింపుల కోసం ఆర్‌ఎఫ్‌ఐడీ, ఫాస్టాగ్‌లు వాడేవారికి 10 శాతం రాయితీ కల్పించింది.

**రాజకీయ పార్టీలు కూడా విరాళాలు ఈ పద్ధతిలోనే సేకరించాలని అన్నారు.

SHARE