కొత్త కేలండర్ తో ఎన్ని లాభాలో..!

0
433
Govt to discuss Should financial year sync with calendar year

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]Govt to discuss Should financial year sync with calendar year

ప్రస్తుతం దేశంలో కేలండర్ ఇయర్ కు, ఆర్థిక సంవత్సరానికి తేడా ఉంటోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్ కు, మన మార్కెట్ కు చాలా వ్యత్యాసం ఉంటుంది. భారత్ లో విధులు నిర్వహించే అంతర్జాతీయం కంపెనీలు కూడా తప్పనిసరై ఈ మార్పు చేసుకుంటున్నాయి. కానీ చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో జనవరి, డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్నే పాటిస్తున్నారు. కానీ మనం మాత్రం వలస పాలకులు వదిలేసి వెళ్లిన అదే ఏప్రిల్, మార్చ్ ఆర్థిక సంవత్సరాన్నే పాటిస్తున్నాం.

ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పుడే ఆర్థిక సంవత్సరాన్ని మార్చాలనే ప్రతిపాదన వచ్చినా.. అడుగు ముందుకు పడలేదు. మొన్నటికి మొన్న నీతి అయోగ్ సమావేశంలో మోడీ మరోసారి ఈ విషయం ప్రస్తావించారు. కేంద్ర ఆర్థిక సలహాదారుల కమిటీ కూడా జనవరి, డిసెంబర్ ఇయర్ కు మారడం మంచిదని నివేదిక ఇచ్చింది. రుతుపవన చక్రానికి అనుగుణంగా ఉండటం, భారత్ మార్కెట్ ను అంతర్జాతీయ వ్యవస్థతో అనుసంధానించడానికి కేలండర్ మార్పు దోహదపడుతుందనే అంచనాలున్నాయి.

కానీ ఇప్పటికే దేశంలో చాలా సంస్కరణలు జరుగుతున్నాయి. జీఎస్టీ లాంటి కీలక బిల్లుల కోసం చట్టాలు మార్చడానికి ఉన్న మానవవనరులు చాలడం లేదు. అలాంటిది ఇప్పటికిప్పుడు కేలండర్ మార్పు కుదిరే పనికాదని, కొన్ని రాష్ట్రాలు చెబుతున్నాయి. ఆర్థిక నిపుణులు కూడా రెండు, మూడేళ్లు ఆగాలంటున్నారు. అప్పుడే కంపెనీలకు కూడా కేలండర్ మార్పుకు అనుగుణంగా సర్దుబాట్లు చేసుకునే వెసులుబాటు లభిస్తుందంటున్నారు.

Leave a Reply