క్రిష్ ఎక్కువ మాట్లాడాడు…అంతా శాతకర్ణి మహిమ

0
693

director-krish-speechక్రిష్ …అయన చేసిన సినిమాలు చూస్తే చాలు…దర్శకుడిగా ఆయనేమిటో చెప్పడానికి.ఎంత గొప్ప సినిమాలు తీసినా వాటి గురించి అంత తక్కువ మాట్లాడే అలవాటు ఆయనది.కానీ గౌతమీ పుత్ర శాతకర్ణి ఆడియో విడుదల వేడుకలో క్రిష్ కొత్తగా సరి కొత్తగా కనిపించాడు.ఎక్కువ మాట్లాడేశాడు. వేదిక మీద ఓ ముఖ్యమంత్రి …మరో కేంద్ర మంత్రి ఉన్నప్పటికీ క్రిష్ ఎక్కడా మొహమాటపడలేదు.ఆ వేదిక మీద నుంచే తల్లి,భార్యని ఉద్దేశించి మీరు గర్వపడే సినిమా తీశానని చెప్పాడు.వాళ్ళు మాత్రమే కాదు యావత్ తెలుగు జాతి గర్వపడే సినిమా తీశానని సగర్వంగా ప్రకటించాడు.క్రిష్ అంతగా భావోద్వేగంతో కదిలిపోవడానికి కారణం మరెవరో కాదు గౌతమీపుత్ర శాతకర్ణి.
విక్రమ్ గైడ్ లో శాతకర్ణి గురించి కొద్దిగా దొరికిన సమాచారాన్ని ఆధారం చేసుకుని …అయన గురించి తెలుసుకునే క్రమంలో ఎన్నో పుస్తకాలు తిరగేసిన క్రిష్ ఎంతో అన్వేషణ జరిపారు.చివరికి అందుబాటులో ఉన్న చారిత్రక సమాచారాన్ని …కాస్తంత ఊహ జోడించి గౌతమీ పుత్ర శాతకర్ణి గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.తాను అనుకున్న విధంగా ఆ చిత్రం రావడంతో క్రిష్ లాంటి దర్శకుడు కూడా ఉత్సాహం ఆపుకోలేకపోయారు.అందుకే కాస్త ఎక్కువ మాట్లాడారు.అంతా గౌతమీ పుత్ర శాతకర్ణి మహిమ

Leave a Reply