జీఎస్టీ బిల్లులో ఇంకా మార్పులు చేర్పులు..

0
563

gst bill changed arun jaitley
జీఎస్‌టీ బిల్లు విషయంలో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ ప్రార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మోడీ కేబినెట్ ..బిల్లులో స్వల్ప మార్పులకు శ్రీకారం చుట్టింది. జీఎస్టీ బిల్లులో మార్పులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఒక శాతం అదనపు పన్ను తొలగించాలన్న రాష్ట్రాల ప్రతిపాదనకూ కేంద్రం అంగీకారం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల మధ్య లావాదేవీల్లో అదనంగా ఉన్న ఒక శాతం అమ్మకం పన్ను తొలగింపునకు ఆమోదం తెలిపారు. అన్ని రాష్ట్రాలకు ఐదేళ్లపాటు వంద శాతం పరిహారం ఇచ్చేందుకు ఆమోదించారు.

రాష్ట్రాల్లో తయారీ రంగంపై ఒక శాతం పన్నును తొలగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలను పరిశీలించిన కేంద్ర కేబినెట్ ..బిల్లులో కొన్ని సవరణలకు శ్రీకారం చుట్టింది. తాజాగా సవరణ ప్రకారం రాష్ట్రాలకు మొదటి ఐదేళ్లు పూర్తి నష్టపరిహారం చెల్లిస్తారు.. రాష్ట్రల ఆర్ధిక మంత్రుల సమావేశంలో వివిధ రాష్ట్రాల అభ్యర్ధన మేరకు కేబినెట్ ఈ మేరకు సవరణ చేసినట్లు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. కాగా పార్లమెంట్ వర్షకాల సమావేశాలు ముగిసే లోపు జీఎస్‌టీ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించి ఆమోదం పొందేలా చూడాలని మోడీ సర్కార్ పట్టుదలతో ఉంది. ఈ సారి మోడీ సర్కార్ ఏ మేరకు సక్సెక్ అవుతుందనే అంశంపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది

Leave a Reply