భాగ్యనగర్ లో బుల్లెట్.. కాంగ్రెస్ నేత టార్గెట్

 gun fairing hyderabad congress politician yadagiri
సికింద్రాబాదు పరిధిలోని బోయిన్ పల్లిలో కొద్దిసేపటి క్రితం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో కాంగ్రెస్ పార్టీ నేత యాదగిరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు 
సమాచారం. కాల్పుల తర్వాత వెనువెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స ప్రారంభించిన కాసేపటికే ఆయన చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే 
ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్లు, పరిస్థితి మాత్రం విషమంగా వున్నట్టు తాజా సమాచారం.
మల్లికార్జున నగర్ లోని ఓ ఆసుపత్రి సమీపంలో నిలబడ్డ యాదగిరిని లక్ష్యంగా చేసుకుని బైక్ పై వచ్చిన దుండగులు కాల్పులకు దిగారు. దుండగుల తుపాకీ నుంచి దూసుకువచ్చిన ఓ బుల్లెట్ ఛాతీలోకి వెళ్లగా, మరో బుల్లెట్ తొడ భాగంలోకి దూసుకెళ్లింది.  కాల్పుల్లో తీవ్ర గాయాలపాలైన యాదగిరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
భూవివాదంతోనే ప్రత్యర్థులు యాదగిరిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీపీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.  భూవివాదాలలో యాదగిరి పేరు తరచుగా వినిపిస్తోందని స్థానికులు అంటున్నారు. శుక్రవారం రాత్రే అల్వాల్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఆ ఘటనకు, ఇప్పటి ఘటనకు ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది.
రక్తమోడుతున్న స్థితిలోనే యాదగిరి దుండగులపైకి లంఘించి వారి చేతిలోని తుపాకీని లాగేసుకున్నాడు. యాదగిరి ధైర్యంతో కంగారుతిన్న దుండగులు అక్కడి నుంచి పరారు కాగా… వారి చేతిలోని తుపాకీని యాదగిరి పోలీసులకు అప్పగించారు. 
SHARE