గుణశేఖర్ దర్శకత్వంలో ఎన్టీఆర్..??

Posted February 3, 2017

gunasekhar direct with ntr Hiranyakashipa movie‘రుద్రమదేవి’ పేరుతో చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించి శభాష్ అనిపించుకున్నాడు గుణశేఖర్. రుద్రమదేవి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే  ఆ సినిమాకి సీక్వెల్ గా ‘ప్రతాప రుద్రుడు’ చేయాలని భావిస్తున్నాట్లు ప్రకటించాడు కూడా.  అయితే ఆ సినిమా మొదలు కావడానికి  ఇంకా సమయం పడుతుండడంతో ప్రతాపరుద్రుడు కంటే ముందుగా హిరణ్య కశ్యపుడి ఇతివృత్తాన్ని ప్రధానంగా తీసుకుని ఓ పౌరాణిక చిత్రాన్ని రూపొందించనున్నాడట.  

‘హిరణ్య కశిప’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తాడని భావిస్తోందట చిత్రయూనిట్. మరి గుణశేఖర్ దర్శకత్వం వహించిన బాలరామాయణం ద్వారా పాపులారిటీ సాధించిన  ఎన్టీఆర్ ఇప్పుడు అతనికి డేట్స్ ఇస్తాడో లేదో చూడాలి.

SHARE